
తలైవా రజనీకాంత్ పేటా, అజిత్ విశ్వాసం బాక్సాఫీస్ వద్ద పోటీపడుతుంటే.. వారి ఫ్యాన్స్ థియేటర్ వద్ద గొడవలు పడుతున్నారు. వీరి ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేయలేక పోలీసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. భారీ ఫ్యాన్ బేస్ ఉన్న ఇద్దరు బడా హీరోల సినిమాలు ఒకే రోజు విడుదలైతే ఎలా ఉంటుందో తమిళనాడులో పరిస్థితి చూస్తుంటే అర్థమవుతుంది. ఇక ఈ రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ రాగా.. కలెక్షన్స్‌లో మాత్రం విశ్వాసం టాప్‌లో ఉంది.
తమిళనాడులో ఈ చిత్రం టాప్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. మాస్ ఆడియన్స్‌ను మెప్పించిన ఈ మూవీ వసూళ్లలో ముందంజలో ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తొలిరోజు విశ్వాసం దాదాపు 26కోట్లను వసూళు చేసినట్టు తెలుస్తోంది. వేదాలం, వివేగం, వీరం లాంటి హ్యాట్రిక్ హిట్స్ తరువాత శివ డైరెక్షన్‌లో నటించిన విశ్వాసం కూడా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. నయన తార హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతాన్ని అందించారు.
Comments
Please login to add a commentAdd a comment