
సౌత్‌లో సూపర్‌స్టార్ రేంజ్‌ను అనుభవిస్తున్న హీరోయిన్ నయనతార. ఓ వైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను చేస్తూనే.. మరోవైపు మాస్ ఎంటర్‌టైన్ మూవీల్లోనూ నటిస్తోంది. కోలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతోంది. అక్కడ పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండే.. నయన్ తన ప్రియుడు విఘ్నేశ్ శివన్‌తో అప్పుడప్పుడు బయటకు వెళ్తుంది.
తాజాగా విఘ్నేష్ శివన్, నయన్‌లు కలిసి ఉన్న ఓ పిక్ వైరల్ అవుతోంది. ఈ సెల్ఫీలో విఘ్నేశ్ తన ప్రియురాలిని కూడా బంధించాలని చూస్తున్నా.. నయన్ మాత్రం తన చేతులతో మొహాన్ని దాచేసింది. అయితే సిగ్గుతో అలా చేసిందా?.. కొత్త సినిమా లుక్‌ను రివీల్ చేయద్దని చేతులు అడ్డు పెట్టావా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం నయనతార సైరా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను పెంచేపనిలో పడింది యూనిట్. మరి ఈ ప్రమోషన్ ఈవెంట్లకైనా నయన్ వస్తుందో లేదో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment