
తమిళసినిమా: నటి నయనతార ఆత్మవిశ్వాసమే తనని అగ్రస్థాయికి చేర్చిందని శివకార్తీకేయన్ వ్యాఖ్యానించారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం వేలైక్కారన్. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ ఆదివారం సాయంత్రం చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్‌లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మోహన్‌రాజా మాట్లాడుతూ తనకు లభించే అభినందనలు తన తల్లిదండ్రులకే చెందుతాయన్నారు. శ్రమను నమ్మి జీవించే వారికి ఈ చిత్రం సమర్పణ అని అన్నారు.
నయన పారితోషికం తీసుకోలేదు
శివకార్తీకేయన్ మాట్లాడుతూ తనీఒరువన్ చిత్రాన్ని రెండు సార్లు చూసి దర్శకుడు మోహన్‌రాజాకు ఫోన్ చేసి అభినందించానన్నా రు. అదే సమయంలో మీ దర్శకత్వంలో చిత్రం చేయాలని తానే అడిగానని చెప్పారు. అలా వేలైక్కారన్ మొదలైనట్టు తెలిపారు. నటి నయనతారను ఏకన్ చిత్ర షూటింగ్‌లో చూశానని తరువాత తాను హీరోగా నటించిన ఎదుర్ నీశ్చల్ చిత్రంలో అతిథిగా మెరిశారని తెలిపారు.ఆ చిత్రానికి నయనతార పారితోషికమే తీసుకోలేదని తెలిపారు. నయనతార ఆత్మవిశ్వాసమే ఆమెను ఉన్నత స్థాయికి చేర్చిందని శివకార్తీకేయన్ పేర్కొన్నారు. సంగీత దర్శకుడు అనిరుధ్ లేకుంటే శివకార్తీకేయన్ లేడని ట్విట్టర్‌లో పేర్కొంటున్నారని, అది నిజమే అన్నారు. ఎడిటర్ మోహన్, అనిరుధ్, ఆర్‌జే.బాలాజీ, మదన్‌కార్గీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment