
దక్షిణాదిలోనే అగ్రనటిగా వెలిగిపోతున్నారు కేరళ బ్యూటీ నయనతార. ఓ పక్క తనకంటే చిన్నహీరోలతో పాటు మరోపక్క హీరోయిన్ ఒరియెంటెడ్ చిత్రాలతో కూడా దూసుకుపోతుంది నయన్. వరుస షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నప్పటికి.. మధ్యలో గ్యాప్ తీసుకుని బాయ్‌ఫ్రెండ్ విఘ్నేశ్‌శివన్‌ను తీసుకుని విదేశాలకు చెక్కేస్తోంది. న్యూయిర్ వేడుకల కోసం అమెరికా వెళ్లి ఎంజాయ్ చేసిన ఈ జంట.. ఈ నెల చివరిలో మరోసారి అమెరికాకు వెళ్లారు. అక్కడ జాలీగా ఎంజాయ్ చేస్తూ తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఒక అందమైన యువతి పెయింటింగ్‌ను ఆసక్తిగా గమనిస్తోన్న నయనతార ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు విఘ్నేశ్‌శివన్. ఈ ఫోటో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ‘ఒక చిత్ర కళాఖండంతో మరో చిత్రకళాఖండం నిలబడిందే ఆహా ఏమి ఆశ్చర్యం’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.
Comments
Please login to add a commentAdd a comment