నయన్‌ ఐరన్‌ లేడీ! | Director Vignesh Shivan Says About Nayanatara | Sakshi
Sakshi News home page

Published Wed, Mar 28 2018 10:11 AM | Last Updated on Wed, Mar 28 2018 10:11 AM

Director Vignesh Shivan Says About Nayanatara - Sakshi

తమిళసినిమా: కోలీవుడ్‌లో దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌, నటి నయనతార సంచలన ప్రేమజంటగా వార్తల్లో హల్‌చల్‌ చేస్తున్న విషయం తెలిసిందే. నానుమ్‌ రౌడీ దాన్‌ చిత్ర షూటింగ్‌ సమయంలో కలిగిన వీరి పరిచయం ప్రేమగా మారింది. అప్పటి నుంచే మీరి మధ్య ప్రేమ గురించి మీడియా కోడై కూస్తున్నా, ఈ జంట మాత్రం చక్కగా ఎంజాయ్‌ చేశారేగానీ వారి ప్రేమ కలాపాల గురించి నోరు మెదపలేదు. 

అలాంటిది  కొంతకాలంగా నయనతార దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో పబ్లిక్‌ ఫంక్షన్‌లలోనూ దర్శనమిస్తున్నారు. ఇక పుట్టిన రోజున ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం, విదేశాల్లో విహరించడం, ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పొందుపరుస్తూ మీడియాకు మంచి పనికల్పించడం వంటి చర్యలతో ఎంజాయ్‌ చేస్తున్నారు. ఆ మధ్య ఒక అవార్డు వేదికపై ఈ అవార్డును అందుకోవడానికి కారణమైన తన తల్లిదండ్రులు, సహోదరుడు, ప్రేమికుడికి ధన్యవాదాలు అని పేర్కొంది నయన్‌.

ఇలాంటి పరిస్థితుల్లో ఎట్టకేలకు నయనతార ఆయనే నా కాబోయే వరుడు అంటూ విఘ్నేష్‌ శివన్‌ను తన జీవిత భాగస్వామిగా ఖరారు చేశారు. ఇదిలా ఉండగా దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ వెర్షన్‌కు వస్తే ఇటీవల ఒక టీవీ చానల్‌లో  నయనతార ప్రస్తవన రాగా ఆమె తనకు ఎందుకు నచ్చిందన్న విషయాన్ని చెబుతూ నయనతార తన ఫేవరేట్‌ నటి అన్నారు.

అంతకు మించి దేన్నైనా ఎదుర్కొనే మనోధైర్యం కలిగిన యువతి అని పేర్కొన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నయనతార ఐరన్‌ మహిళామణి అని పేర్కొన్నారు. అందుకే తను అంటే తనకు ఎక్కువ ఇష్టం అని చెప్పారు. ఆ విధంగా భగవంతుడి ఆశీర్వాదం పొందానని దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ అన్నారు. ఈ సంచలన జంట ఇప్పటికే సహజీవనం సాగిస్తున్నా, త్వరలో పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అవుతున్నట్లు సినీ వర్గాల టాక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement