
తేరీ, మెర్సల్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన అట్లీ, విజయ్‌ల కాంబినేషన్‌లో మరో చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ముచ్చటగా మూడోసారి రికార్డులను క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్న ఈ కాంబో.. త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం.
ఈ చిత్ర పూజా కార్యక్రమాలు రేపు జరుగబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. విజయ్ నటిస్తున్న ఈ 63వ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. క్రీడానేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్.. స్పోర్ట్స్ కోచ్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ నటిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment