
ఏ కట్టయినా... నయనతారకు అందం, చూసేవాళ్లకు ఆనందం మనమూ ట్రై చేస్తే మహదానందం!
► సైమా అవార్డ్‌కి ప్రత్యేకం అనిపించేలా హాప్‌వైట్ ఖాదీ చీర, దీనికి కాంట్రాస్ట్ కలర్ రెడ్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ని ఎంపిక చేశాం. చీర కొంగు సింగిల్ స్టెప్, దాని మీదుగా ఆమ్రపాలి డిజైనర్ నెక్ పీస్, ఒకవైపుగా ఉండే హెయిర్‌స్టైల్.. వేడుకలో హైలైట్‌గా నిలిచింది.
► ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ వేడుకకు ఈ బ్లాక్ మిడీ డ్రెస్‌ని మింట్ బ్లష్ డిజైనర్ స్టోర్ నుంచి ఎంపిక చేశాం. కరెక్ట్ ఫిట్‌తో క్లాసీగా ఉండే ఈ డ్రెస్ వెస్ట్రన్ పార్టీలకు బాగా నప్పుతుంది. దీనికి వంకీలు తిరిగిన కేశాలంకరణ, బ్లాక్ హీల్స్, సుహానే పిట్టే ఇయర్ కఫ్స్ వాడటంతో లుక్ సింపుల్‌గా, సొగసుగా మారిపోయింది.
► రితుకుమార్ డిజైన్ చేసిన టాప్, కాటన్ స్కర్ట్‌ని సినిమాలోని పాటకు ఉపయోగించాం. దీనికి తగ్గట్టుగా ఫ్యాన్సీ జువెల్రీ వాడాం. కాలేజీ అమ్మాయిలకు ఇది మంచి జోష్‌నిచ్చే డ్రెస్సింగ్.
► రితుకుమార్ డిజైన్ చేసిన కుర్తీ ఇది. బాటమ్‌గా బ్లూజీన్స్. ఈ కాలం వనితకు తగిన డ్రెస్ ఇది. దీనికి కాంబినేషన్‌గా సిల్వర్ జువెల్రీ ధరించడంతో ఫ్యూజన్ లుక్ వచ్చేసింది.
► సినిమాలో పాట కోసం ఈ ప్రింటెడ్ కాటన్ కోటా శారీని ఎంపిక చేశాం. దీనికి కాంట్రాస్ట్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ని ఉపయోగించాం. సింపుల్ ఈవెంట్స్‌కైనా,, పెద్ద పెద్ద వేడుకల్లోనూ ఇలాంటి చీరలను ధరించవచ్చు. అయితే, కేశాలంకరణ, ఫ్యాషన్ జువెల్రీ ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
► ఎక్కడైనా ఎప్పుడైనా సింప్లిసిటీ ఈజ్ ద బెస్ట్ అనిపించాలంటే ఇలా టాప్ టు బాటమ్ సింగిల్ కలర్‌ని ఎంపిక చేసుకోవచ్చు. దీని వల్ల క్లాసీ లుక్ వస్తుంది. అవార్డు ఫంక్షన్‌కి బ్లాక్ కలర్
► శారీ.. దీనికి ఎలాంటి హంగులేని సింపుల్ బార్డర్, అదే రంగు స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ని ఉపయోగించాం. దీంతో పాటు సింపుల్ జువెల్రీ, జడతో ఎందరిలో ఉన్నా పత్యేకంగా కనిపిస్తుంది.
► నికషా డిజైన్ చేసిన సింగిల్ పీస్ స్లీవ్‌లెస్ కుర్తీకి బాటమ్‌గా స్కర్ట్ ఉపయోగించాం. దీనికి గోల్డ్, సిల్వర్ రెండు రకాల జువెల్రీని ఉపయోగించాం. కుర్తీకి యాంటిక్ టచ్ ఎంబ్రాయిడరీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇది ఫ్యుజన్ టచ్‌తో సినిమాలో సాంగ్‌కి బెస్ట్ కాంప్లిమెంట్స్‌ని తెచ్చింది.