ప్రియుడితో కలిసి నయన క్రిస్మస్‌ వేడుకలు | nayanthara celebrates christmas with vignesh shivan | Sakshi
Sakshi News home page

ప్రియుడితో కలిసి క్రిస్మస్‌ వేడుకలు

Published Tue, Dec 26 2017 6:34 PM | Last Updated on Tue, Dec 26 2017 7:30 PM

nayanthara celebrates christmas with vignesh shivan - Sakshi

సాక్షి, సినిమా: అగ్రతార నయనతార అరుదైన మైలురాయిని అధిగమించారు. నటిగా 14 ఏళ్లను పూర్తి చేసికుని 15వ ఏటలో అడుగుపెట్టారు. ఇన్నేళ్లు హీరోయిన్‌గా రాణించడం విశేషం కాకపోవచ్చు. ఇప్పటికీ నంబర్‌వన్‌ హీరోయిన్‌గా వెలుగొందడం కచ్చితంగా విశేషమే. కానీ ప్రేమ విషయంలో రెండు సార్లు చిత్తుగా ఓడిపోయారు నయన్‌. అందుకోసం నటననే పణంగా పెట్టడానికి సిద్ధం అయినా ప్రేమలో గెలుపొందలేకపోయారు. తాజాగా మరోసారి ప్రేమలో పడ్డారనే ప్రచారం జోరుగానే సాగుతోంది. 

నయన్‌ ప్రస్తుతం దర్శకుడు విఘ్నేశ్‌ శివతో సహజీవనం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీన్ని వారిద్దరూ ఖండించలేదన్నది గమనార్హం. పైగా వారి పుట్టిన రోజు వేడుకలను కలిసి జరుపుకుంటూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ‘నటిగా 14 ఏళ్లు పూర్తి చేసుకున్న నయనతారను మరింత పవర్, విక్టరీలదో ముందుకు సాగాలి. అందుకు ఆ భగవంతుడి ఆశీస్సులుండాలని కోరుకుంటూ.. లవ్లీ నయనతార’ అంటూ గ్రీట్‌ చేస్తూ దర్శకుడు విఘ్నేశ్‌శివ ట్వట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అంతే కాదు ఈ ప్రేమ జంట సోమవారం క్రిస్మస్‌ వేడుకను కలిసి జరుపుకున్నారు. ఆ ఫొటోలను నయనతార తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.ఇక ఆమె అభిమానులైతే 14 ఇయర్స్‌ ఆఫ్‌ నయనతార అంటూ సంబరాలు జరుపుకుంటూ ట్విట్టర్‌లో అభినందనలు తెలుపుతున్నారు. ఇటీవల విడుదలైన అరమ్‌ చిత్రం అనూహ్య విజయంతో లేడీ సూపర్‌స్టార్‌గా పేరు పొందారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement