chrismas celebrations
-
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రోజా
-
రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
-
న్యూ ఇయర్ వేడుకలకు బ్రేక్..
-
సీఎం కేసీఆర్ క్రైస్తవ సోదరుల కోసం ప్రత్యేక విందు
-
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ ఆధ్వర్యంలో ఘనంగా 2021 క్రిస్మస్ సంబరాలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్(తాల్) డిసెంబర్ 4న వర్చువల్ పద్థతిలో క్రిస్మస్ సంబరాలను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో లండన్, యూకేలోని ఇతర ప్రాంతాల్లోని చర్చిలకు సంబంధించి సుమారు 100 మంది తెలుగువారు, తాల్ సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందలాది తెలుగువారు ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్, ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ స్టీఫెన్ టీమ్స్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ప్రజలకు క్రిస్మస్ సందేశాన్ని అందించారు. గత 15 సంవత్సరాలకు భిన్నంగా తాల్.. గత ఏడాది, ఈ సంవత్సరం కోవిడ్19 ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నిర్వహించిన సేవా, సాంస్కృతిక కార్యక్రమాలను కొనియాడారు. తాల్ వైస్ చైర్మన్ రాజేష్ తోలేటి మాట్లాడుతూ.. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. తాల్ గురించి ప్రస్తావిస్తూ.. గత 16 సంవత్సరాల నుంచి తెలుగు భాష మరియు సంస్కృతిని లండన్‌లోని తెలుగు సమాజానికి అందించే సదుద్దేశంతో కృషి చేస్తుందని తెలిపారు. అలాగే ఈ క్రిస్మస్ సంబరాలు విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన రవి మోచర్ల, జమీమ రత్నాకర్ దార, జస్టిన్, కారోల్, డానియల్ విక్టర్ తదితరులను ప్రత్యేకంగా అభినందించారు. బ్రదర్ డేవిస్ పెనియల్ క్రిస్మస్ ఆరాధనతో కార్యక్రమం ఆరంభించారు. రెవరాండ్ పాల్, పాస్టర్ డొమినిక్, బ్రదర్ డానియల్ ఇతర చర్చి నాయకులు, పెద్దలు పాల్గొని యేసు క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా పిల్లలకు క్విజ్, చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. లండన్, యూకే తదితర ప్రాంతాలకు చెందిన తల్లిదండ్రులు.. వారి పిల్లలతో క్రిస్మస్ పాటలను పాడించి వీక్షకులను ఆనందపరిచారు. ఇదిలా ఉంటే.. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా భారత దేశపు “కల్వరి లవ్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్” నుంచి రెవరాండ్ డాక్టర్ జో మధు మరియు రెవరాండ్ డాక్టర్ వీణ జెస్సి పాల్గొన్నారు. కరోనా కారణంగా మానవాళి ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ వేడుకల్లో తాల్ ట్రస్టీలు నవీన్ గాదంసేతి, కిషోర్ కస్తూరి, గిరిధర్ పుట్లూర్, అనిల్ అనంతుల, అనితా నోములా తదితరులు తమ సహకారాన్ని అందించారు. -
మెదక్ చర్చిలో వైభవంగా క్రిస్మస్ వేడుకలు
-
నల్లకుంటలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
-
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్
-
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విజయవాడలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని A1 కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి కేక్ కట్ చేసి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలు అందించినవారికి అవార్డులను అందచేశారు. ఈ వేడుకల్లో హొంమంత్రి సుచరిత, అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, రక్షణ నిధి, మేరుగు నాగార్జున, కైలే అనిల్, సామినేని ఉదయభాను, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. అంతకు ముందు హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ... ‘మంచి పాలకుడు రావాలని మీరు చేసిన కన్నీటి ప్రార్థనలు ఫలించాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరు నెలల పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అండగా నిలిచారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో పెద్ద పీట వేశారు’ అని అన్నారు. -
ప్రియుడితో కలిసి నయన క్రిస్మస్ వేడుకలు
సాక్షి, సినిమా: అగ్రతార నయనతార అరుదైన మైలురాయిని అధిగమించారు. నటిగా 14 ఏళ్లను పూర్తి చేసికుని 15వ ఏటలో అడుగుపెట్టారు. ఇన్నేళ్లు హీరోయిన్గా రాణించడం విశేషం కాకపోవచ్చు. ఇప్పటికీ నంబర్‌వన్ హీరోయిన్గా వెలుగొందడం కచ్చితంగా విశేషమే. కానీ ప్రేమ విషయంలో రెండు సార్లు చిత్తుగా ఓడిపోయారు నయన్. అందుకోసం నటననే పణంగా పెట్టడానికి సిద్ధం అయినా ప్రేమలో గెలుపొందలేకపోయారు. తాజాగా మరోసారి ప్రేమలో పడ్డారనే ప్రచారం జోరుగానే సాగుతోంది. నయన్ ప్రస్తుతం దర్శకుడు విఘ్నేశ్ శివతో సహజీవనం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీన్ని వారిద్దరూ ఖండించలేదన్నది గమనార్హం. పైగా వారి పుట్టిన రోజు వేడుకలను కలిసి జరుపుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ‘నటిగా 14 ఏళ్లు పూర్తి చేసుకున్న నయనతారను మరింత పవర్, విక్టరీలదో ముందుకు సాగాలి. అందుకు ఆ భగవంతుడి ఆశీస్సులుండాలని కోరుకుంటూ.. లవ్లీ నయనతార’ అంటూ గ్రీట్ చేస్తూ దర్శకుడు విఘ్నేశ్‌శివ ట్వట్టర్లో పోస్ట్ చేశారు. అంతే కాదు ఈ ప్రేమ జంట సోమవారం క్రిస్మస్ వేడుకను కలిసి జరుపుకున్నారు. ఆ ఫొటోలను నయనతార తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.ఇక ఆమె అభిమానులైతే 14 ఇయర్స్ ఆఫ్ నయనతార అంటూ సంబరాలు జరుపుకుంటూ ట్విట్టర్లో అభినందనలు తెలుపుతున్నారు. ఇటీవల విడుదలైన అరమ్ చిత్రం అనూహ్య విజయంతో లేడీ సూపర్‌స్టార్‌గా పేరు పొందారు. Christmas Tree🎄A frozen one this time 👍..Celebrations all over🎅 #MerryChristmasAll once again pic.twitter.com/DrSOM61S5F — Nayanthara✨ (@NayantharaU) 26 December 2017 #14YearsOfNayanism 😍😍😍 Wishing more power & victories to u #Nayanthara Keep it going 😇😍 A lovely day with a lot of God's grace:) 'Twas a beautiful Christmas Day! Loads of positivity ! Loads of Love for #PeelaPeela 😍😇 Next singles, song teasers&a lot more cumin #TSK pic.twitter.com/z19NusqQz8 — Vignesh ShivN (@VigneshShivN) December 25, 2017 -
మెదక్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
సాక్షి, మెదక్: ప్రసిద్ధ మెదక్ సీఎస్ఐ చర్చిలో సోమవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశం నలుమూలల నుంచి భక్తులు వేడుకలకు హాజరయ్యారు. సీఎస్ఐ సంఘం అధ్యక్షుడు బిషప్ ఏసీ సాల్మన్‌రాజ్ ఆధ్వర్యంలో వేకువజాము నుంచే ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. ప్రెస్బిటరీ ఇన్చార్జి వై.రాబిన్సన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చి ఎదురుగా ఉన్న శిలువ వద్ద భక్తులు కొవ్వొత్తులు ఉంచి ప్రార్థనలు చేశారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మహాదేవాలయం ప్రాంగణంలో కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. భారతి సిమెంట్ ఆధ్వర్యంలో పాలు వితరణ: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని భారతి సిమెంట్ ఆధ్వర్యంలో సుమారు ఆరువేల మంది భక్తులకు పాలవితరణ చేశారు. కార్యక్రమంలో చీఫ్ జనరల్ మేనేజర్ కొండల్‌రెడ్డి, సీనియర్ మేనేజర్ ఓబుల్‌రెడ్డి, సేల్స్ మేనేజర్ సతీశ్‌కుమార్, టెక్నికల్ మేనేజర్ గంగాధర్, మెదక్ డీలర్ లింగమూర్తి, విజయ్, లక్ష్మీనారాయణ, సంగమేశ్వర్, కృష్ణకాంత్ ఉన్నారు. -
వైఎస్ఆర్ జిల్లాలో జగన్ మూడురోజుల పర్యటన
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన ఈ నెల 24, 25 తేదీల్లో క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. అలాగే చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటి కోసం 26న పులివెందుల తహసీల్దారు కార్యాలయం వద్ద జరిగే భారీ ధర్నాలో వైఎస్ జగన్ పాల్గొంటారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.