
తమిళసినిమా: నటుడు విజయ్ నటిస్తున్న తాజా చిత్రం గురించి ఇప్పటికే చాలా వివరాలు వెలుగుచూశాయి. ఇది ఆయన 63వ చిత్రం అనీ, లేడీ సూపర్‌స్టార్ నయనతార కథానాయకిగా నటిస్తోందని, ఏజీఎస్ సంస్థ నిర్మిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం అని, ఆస్కార్ అవార్డుగ్రహీత ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారని, దర్శకుడు అట్లీ విజయ్ హీరోగా తెరకెక్కిస్తున్న మూడవ చిత్రం ఇదని లాంటి వివరాలు తెలిసినవే. కాగా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించలేదు గానీ, విడుదల తేదీని మాత్రం ఫిక్స్ చేశారు. అవును చిత్రాన్ని దీపావళికి తెరపైకి తీసుకురానున్నట్లు వర్గాలు ఇప్పటికే వెల్లడించారు.
కాగా కొత్త విషయాలేమిటంటే ఇందలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారన్నది, అది తండ్రి కొడుకులుగా తొలిసారిగా ఈ చిత్రంలో నటిస్తున్నట్లు తాజా సమాచారం. మరో విషయం ఏమిటంటే విజయ్ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర టైటిల్‌ను, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఈ నెల 22న విడుదల చేయడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇకపోతే బాలీవుడ్ స్టార్ నటుడు జాకీష్రాఫ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇందులో నటుడు కదిర్, యోగిబాబు, డేనియల్ బాలాజి, రెబామోనికాజాన్, ఇదుజా, వర్ష బొల్లమ్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడవ చిత్రం కాబట్టి అంచనాలు భారీ స్టాయిలోనే నెలకొన్నాయి. పైగా సర్కార్ వంటి సంచలన చిత్రం తరువాత తెరపైకి రానున్న చిత్రం కావడంతో సినీ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇక విజయ్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో హ్యాట్రిక్ గ్యారెంటీ అని చిత్ర యూనిట్ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అగ్రనటి నయనతార అదనపు ఆకర్షణగా ఉండనే ఉంది. అదే విధంగా చాలా కాలం తరువాత విజయ్ ద్విపాత్రాభినయం చేయడంతో ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Comments
Please login to add a commentAdd a comment