బడ్జెట్‌ కాదు..సబ్జెక్ట్‌ కావాలి..! | simbu new movie press meet | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌ కాదు..సబ్జెక్ట్‌ కావాలి..!

Published Wed, Sep 13 2017 12:30 AM | Last Updated on Tue, Sep 19 2017 4:26 PM

బడ్జెట్‌ కాదు..సబ్జెక్ట్‌ కావాలి..!

బడ్జెట్‌ కాదు..సబ్జెక్ట్‌ కావాలి..!

బ్రేకప్‌ తర్వాత శింబు, నయనతార జంటగా నటించిన సినిమా ‘సరసుడు’. పాండిరాజ్‌ దర్శకత్వంలో టి. రాజేందర్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం టి. రాజేందర్‌ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘గతంలో నేను అందించిన ‘ప్రేమసాగరం’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. మా అబ్బాయి శింబు నటించిన ‘వల్లభ’, ‘మన్మధ’ చిత్రాలు కూడా ప్రేక్షకులను మెప్పించాయి. ఇప్పుడు అదే నమ్మకంతో  ‘సరసుడు’ చిత్రంతో వస్తున్నాం.

నైజాం, ఆంధ్ర, సీడెడ్‌లో మేమే రిలీజ్‌ చేస్తున్నాం. చిన్న సినిమాకు కావాల్సింది బడ్జెట్‌ కాదు.. సబ్జెక్ట్‌ అని నమ్మి ఈ సినిమా చేశాం. మా రెండో అబ్బాయి కురళ్‌ స్వరపరచిన ఐదు పాటలు ఈ చిత్రానికి ఓ హైలైట్‌. తెలుగు ప్రేక్షకుల కోసం ఈ సినిమాకి ‘హలో..’ అనే పాట రాశాను. అలాగే ‘బావ వెయిటింగ్‌..’ అనే పాటను నేనే పాడా’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement