
గతేడాది బర్త్ డే సందర్భంగా ‘సైరా’ చిత్రం టైటిల్ అండ్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసి సినీ ప్రేమికులను ఖుషీ చేశారు నటుడు చిరంజీవి. అలాగే ఈ సారీ ఆ ఖుషీని రెట్టింపు చేసేందుకు ‘సైరా’ టీజర్‌ను రెడీ చేయిస్తున్నారని సమాచారం. చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతోన్న సినిమా ‘సైరా’.
కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై చిరంజీవి తనయుడు, నటుడు రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఆగస్టు 22న చిరంజీవి బర్త్‌డే. ఈ సందర్భంగా నిమిషం నిడివి ఉన్న ‘సైరా’ టీజర్‌ను రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం. అంటే టీజర్ అన్ ద వే అన్నమాట. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన సెట్‌లో వార్ బ్యాక్‌డ్రాప్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment