Mega 154: Chiranjeevi, KS Ravindra Movie Title Poster and Teaser Out - Sakshi
Sakshi News home page

Mega 154 Title: మెగా 154 టైటిల్‌ వచ్చేసింది, ఆకట్టుకుంటున్న చిరు మాస్‌ లుక్‌

Published Mon, Oct 24 2022 12:26 PM | Last Updated on Mon, Oct 24 2022 1:07 PM

Mega 154: Chiranjeevi, KS Ravindra Movie Title Poster and Teaser Out - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి, డైరెక్టర్‌ కేఎస్‌ రవీంద్ర(బాబీ) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మెగా 154గా అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతుంది. ఇటీవల ఈ మూవీ డబ్బింగ్‌ పనులు కూడా మొదలయ్యాయి. అయితే ఇప్పటి వరకు ఈ మూవీ టైటిల్‌ను చిత్ర బృందం రివీల్‌ చేయలేదు. వాల్తేరు వీరయ్య అనే టైటిల్‌ ప్రచారంలో ఉండగా.. దీనిపై అధికారిక ప్రకటన లేదు. తాజాగా దీపావళి పండగ సందర్భంగా మెగా అభిమానులకు సర్‌ప్రైజ్‌ అందిస్తూ ఈ మూవీ టైటిల్‌ పోస్టర్‌తో పాటు టైటిల్‌ టీజర్‌ను చిత్రం బృందం రిలీజ్‌ చేసింది.

చదవండి: మరోసారి మాజీ ప్రియుడితో సుష్మితా, నటిపై నెటిజన్ల అసహనం

ఈ మూవీకి వాల్లేరు వీరయ్య అనే టైటిల్‌ ఖరారు చేసింది మూవీ యూనిట్‌. ఇందుకు సంబంధించి పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ టైటిల్‌ పోస్టర్‌లో చిరు సరికొత్త లుక్‌తో ఆకట్టుకున్నారు. చెవికి పోగు, లుంగీ, గళ్లా చొక్కాతో బీడి కాలుస్తూ మాస్‌ లుక్‌తో దర్శనమిచ్చారు. ఈ టైటిల్‌ పోస్టర్‌, టీజర్‌కు ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన వస్తోంది. కాగా మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతీ హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ  చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

చదవండి: సినిమాల్లోకి ఖుషి కపూర్‌.. చెల్లికి నా సలహా ఇదే: జాన్వీ కపూర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement