చిరంజీవి మీద క్విజ్‌, ప్రైజ్‌మనీ రూ.5 లక్షలు | Shyam Mandala Film Am Aha Teaser Released | Sakshi
Sakshi News home page

Am Aha: చిరంజీవిపై అం అః హీరో క్విజ్‌, మొదటి విజేతకు రూ.5 లక్షలు

Published Thu, Feb 3 2022 1:11 PM | Last Updated on Thu, Feb 3 2022 1:11 PM

Shyam Mandala Film Am Aha Teaser Released - Sakshi

థ్రిల్లింగ్ సీన్స్‌తో ఆకట్టుకుంటున్న 'అం అః' టీజర్.. చిరుపై క్విజ్ పోటీ

డిఫరెంట్ టైటిల్, నేటితరం ఆడియన్స్ కోరుకునే థ్రిల్లింగ్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది 'అం అః' మూవీ. మునుపెన్నడూ చూడని డిఫరెంట్ కథకు తెరరూపమిస్తూ డైరెక్టర్ శ్యామ్ మండ‌ల ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సుధాక‌ర్ జంగం, లావ‌ణ్య హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ 'అం అః' చిత్రానికి ‘ఎ డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్’ ట్యాగ్‌లైన్‌ పెట్టారు. 

రంగ‌స్థ‌లం మూవీ మేక‌ర్స్‌, శ్రీ ప‌ద్మ ఫిలిమ్స్ బ్యాన‌ర్స్‌పై జోరిగె శ్రీనివాస్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సందీప్ కుమార్ కంగుల‌ సంగీతం అందిస్తున్నారు. గురువారం(ఫిబ్రవరి 3న) చిత్ర టీజర్ రిలీజ్ చేశారు. ఒక నిమిషం 12 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్‌లో మర్డర్ మిస్టరీతో పాటు పోలీస్ సీక్వెన్సెస్ చూపిస్తూ హైప్ పెంచేశారు. సస్పెన్స్‌కి తోడు రొమాంటిక్ సన్నివేశాలు, యూత్ ఆడియన్స్ మెచ్చే స్టఫ్ బోలెడంత ఉందని తెలిసేలా టీజర్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. 

ఈ సందర్భంగా హీరో సుధాకర్ జంగం మాట్లాడుతూ.. ''నేను అం అః మూవీలో నటించాను. నాకు సినిమాలు రావడానికి బలమైన కారణం చిరంజీవి గారు. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన చేసే డాన్సులు, ఫైట్స్, మ్యానరిజం నన్ను బాగా ఆకర్షించాయి. అవే నేను సినిమా ఇండస్ట్రీకి రావడానికి బలమైన పునాది వేశాయి. కాబట్టి నేను చిరంజీవి గారి బెస్ట్ మూవీస్ మీద క్విజ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం. దీనికి ప్రైజ్ మనీ 5 లక్షలు.

నేను ఎప్పుడైతే ఈ క్విజ్ గురించి దర్శకనిర్మాతలకు చెప్పానో వాళ్ళు బాగా ఎంకరేజ్ చేశారు. ఈ ప్రోగ్రాంను హైదరాబాద్‌లో 1000 మంది పార్టిసిపెంట్స్‌తో ఫిబ్రవరి 27న కండక్ట్ చేస్తున్నాం. ఇందులో ముఖ్యంగా చిరంజీవి 150 సినిమాల గురించిన ప్రశ్నలే అడగడం జరుగుతుంది. మొత్తం ఆరు రౌండ్స్ ఉంటాయి. ఒక్కో రౌండ్‌లో ఎలిమినేషన్ ఉంటుంది. అలా చివరి వరకు వచ్చిన మొదటి ఐదుగురికి ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ప్రైజ్ మనీ 5 లక్షలు, సెకండ్ ప్రైజ్ మనీ 1 లక్ష, థర్డ్ ప్రైజ్ మనీ 50,000, ఫోర్త్ ప్రైజ్ మనీ 30,000, ఫిఫ్త్ ప్రైజ్ మనీ 20, 000 ఉంటుంది'' అని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement