ప్రియుడి బర్త్‌డేలో.. నయన | Nayanthara celebrates her boyfriend's birthday | Sakshi
Sakshi News home page

ప్రియుడి బర్త్‌డేలో.. నయన

Published Tue, Sep 19 2017 8:07 AM | Last Updated on Tue, Sep 19 2017 4:44 PM

ప్రియుడి బర్త్‌డేలో.. నయన

ప్రియుడి బర్త్‌డేలో.. నయన

సాక్షి, చెన్నై: హీరోయిన్‌ నయనతార తన ప్రియుడి పుట్టినరోజును ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తున్నారు. టాలీవుడ్‌లో క్రేజీ నటిగా, కోలీవుడ్‌లో అగ్ర కథానాయకిగా రాణిస్తున్న నటి నయనతార. నయనతార ప్రియుడిగా ప్రచారంలో ఉన్న దర్శకుడి విఘ్నేశ్‌ శివ సోమవారం తన 32వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ప్రియుడి పుట్టిన రోజు వేడుకను నయనతార ఎక్కడ జరుపుతున్నారో తెలుసా? అమెరికా, న్యూయార్క్‌ నగరంలో. నయనతార, విఘ్నేశ్‌ శివతో కలిసి ఆయన పుట్టిన రోజున జాలీగా న్యూయార్క్‌ నగరంలో ఎంజాయ్‌ చేస్తున్నారు. న్యూయార్క్‌ నగరంలోని బ్రీక్లిన్‌ బ్రిడ్జిపై ఈ ప్రేమ జంట దిగిన ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాల్‌చల్‌ చేస్తోంది.

యువ దర్శకుడు విఘ్నేశ్‌శివతో డీప్‌ లవ్‌లో ఉన్నట్లు, వీరిద్దరూ ఇప్పటికే సహజీవనం చేస్తున్నట్లూ వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. నానూరౌడీదాన్‌ చిత్రం షూటింగ్‌ సమయంలో నయనతారకు దర్శకుడు విఘ్నేశ్‌ శివకు మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారిందన్నది సినీ వర్గాల ప్రచారం. నయనతార ఇటీవల తన ప్రియుడికి అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ కారును బహుమతిగా కొనిచ్చినట్లు ప్రచారం జరిగింది.

సాధారణంగానే ప్రియుడికి బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చిన నయనతార ఆయన పుట్టిన రోజు కానుకగా ఎలాంటి బహుమతి ఇస్తుందోనన్న ఆసక్తి ఆమె అభిమానుల్లో నెలకొలనడం సహజమే కదా. ‘కాగా విఘ్నేశ్‌ శివ ప్రస్తుతం సూర్య హీరోగా తానాసేర్న్‌దకూటం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కీర్తీసురేశ్‌ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. సూర్యతో పాటు పలువురు సినీ ప్రముఖులు విఘ్నేశ్‌ శివకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement