Deep Love
-
ఆ ముచ్చటకు టైం వచ్చింది!
తమిళసినిమా: కల్యాణం వచ్చినా, కక్కు వచ్చినా ఆగదంటారు. అలాంటిది నటి నయనతార ప్రేమ ఇంతకు ముందు కలకలానికి దారి తీస్తే, పెళ్లి ఇప్పుడు సంచలనానికి దారి తీస్తోంది. అందానికి అందం ఈ పుత్తడిబొమ్మ.అందరికీ అందనిది ఈ మలయాళీ భామ అని నయనతారను అనవచ్చనుకుంటా. ఇంతకు ముందు నటుడు శింబు నయనతారను పొందాలనుకున్నారు.అయితే అది ప్రేమ వరకే సాగి ఆగిపోయింది. ఆ తరువాత నటుడు ప్రభుదేవా సొంతం చేసుకోవాలనుకున్నారు. అది పెళ్లి వరకూ వచ్చి ఆగిపోయింది. ఈ రెండు సంఘటనలు నయనతార జీవితంలో మరచిపోలేని చేదు అనుభవాలేనని చెప్పక తప్పదు. అయినా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో వృత్తిపై ఆ ప్రభావం పడకుండా జాగ్రత్త పడిన నయనతార ప్రస్తుతం అగ్రనటిగా రాణిస్తున్నారు.అయితే ఆ అమ్మడు మూడోసారి ప్రేమలో పడి మరోసారి వార్తల్లోకెక్కారు. దర్శకుడు విఘ్నేశ్‌శివ, నయనతార డీప్ లవ్‌లో పడిపోయారన్నది చాలా కాలంగానే గట్టిగా వినిపిస్తోంది. విఘ్నేశ్‌శివ, నయనతార కలిసి ఒకే ఇంటిలో సహజీవనం చేస్తున్నారన్న ప్రచారం జోరుగానే సాగుతోంది. అయినా ఇప్పటికీ వీరిద్దరిలో ఏ ఒక్కరూ తమ ప్రేమ గురించి గానీ, సహజీవనం సాగిస్తున్న విషయంగానీ బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు. ఇక తదుపరి ఘట్టం పెళ్లి. దానికీ సమయం ఆసన్నమైందనేది తాజా సమాచారం. నయనతారకిప్పుడు చేతినిండా చిత్రాలున్నాయి. వాటిలో 90 శాతం హీరోయిన్ సెంట్రిక్ చిత్రాలే. చక్రి తోలేటి దర్శకత్వంలో కొలైయుదీర్ కాలం చిత్రంతో పాటు ఆరమ్ చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ తాజాగా అరివళగన్ దర్శత్వంలో మరో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో నటిం చడానికి అంగీకరించారు. శివకార్తికేయన్‌కు జంటగా నటించిన వేలైక్కారన్ చిత్రం నిర్మాణాంతర కార్యక్రామాలను జరుపుకుంటోంది. తెలుగులో చిరంజీవి సరసన సైరా నరసింహారెడ్డి అనే చారిత్రాత్మక చిత్రంలో నటిస్తున్న నయనతార ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే విఘ్నేశ్‌శివతో పెళ్లి ముచ్చటకు రెడీ అవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తాజాగా ప్రచారం హల్చల్ చేస్తోంది. -
ప్రియుడి బర్త్‌డేలో.. నయన
సాక్షి, చెన్నై: హీరోయిన్ నయనతార తన ప్రియుడి పుట్టినరోజును ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. టాలీవుడ్లో క్రేజీ నటిగా, కోలీవుడ్‌లో అగ్ర కథానాయకిగా రాణిస్తున్న నటి నయనతార. నయనతార ప్రియుడిగా ప్రచారంలో ఉన్న దర్శకుడి విఘ్నేశ్ శివ సోమవారం తన 32వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ప్రియుడి పుట్టిన రోజు వేడుకను నయనతార ఎక్కడ జరుపుతున్నారో తెలుసా? అమెరికా, న్యూయార్క్ నగరంలో. నయనతార, విఘ్నేశ్ శివతో కలిసి ఆయన పుట్టిన రోజున జాలీగా న్యూయార్క్ నగరంలో ఎంజాయ్ చేస్తున్నారు. న్యూయార్క్ నగరంలోని బ్రీక్లిన్ బ్రిడ్జిపై ఈ ప్రేమ జంట దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తోంది. యువ దర్శకుడు విఘ్నేశ్‌శివతో డీప్ లవ్‌లో ఉన్నట్లు, వీరిద్దరూ ఇప్పటికే సహజీవనం చేస్తున్నట్లూ వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. నానూరౌడీదాన్ చిత్రం షూటింగ్ సమయంలో నయనతారకు దర్శకుడు విఘ్నేశ్ శివకు మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారిందన్నది సినీ వర్గాల ప్రచారం. నయనతార ఇటీవల తన ప్రియుడికి అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ కారును బహుమతిగా కొనిచ్చినట్లు ప్రచారం జరిగింది. సాధారణంగానే ప్రియుడికి బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చిన నయనతార ఆయన పుట్టిన రోజు కానుకగా ఎలాంటి బహుమతి ఇస్తుందోనన్న ఆసక్తి ఆమె అభిమానుల్లో నెలకొలనడం సహజమే కదా. ‘కాగా విఘ్నేశ్ శివ ప్రస్తుతం సూర్య హీరోగా తానాసేర్న్‌దకూటం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కీర్తీసురేశ్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. సూర్యతో పాటు పలువురు సినీ ప్రముఖులు విఘ్నేశ్ శివకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. -
చెప్పకుంటే రాఖీ కట్టేస్తా!
తమిళసినిమా: లేకపోతే రాఖీ కట్టేసి అన్నయ్యగా ఫిక్స్ అయిపోతా! ఏమిటి తలా, తోక లేని రాతలు అనుకుంటున్నారా? అయితే రండి విషయంలోకి వెళదాం. చెన్నై చిన్నది సమంత, తెలంగాణ అందగాడు నాగచైతన్య డీప్ లవ్‌లో ఉన్న సంగతి గురించి తెలిసిందే. ఈ లవర్స్ వచ్చే నెల (అక్టోబర్) ఆరో తేదీ అగ్నిసాక్షిగా ఏడడుగులు వేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఆ అందమైన జంట ప్రేమకు ఎక్కడ బీజం పడిండి, పెళ్లి ఎలా ఖాయం అయ్యిందన్న విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి చాలా మందిలో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటుడు నాగచైతన్య తాజాగా లావణ్యా త్రిపాఠితో కలిసి రొమాన్స్ చేసిన చిత్రం యుద్ధం చరణం. ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా నాగచైతన్యను సమంతతో ప్రేమాయణం గురించి అడగ్గా చాలా ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు.అవేమిటో చూద్దాం. సమంతతో ప్రేమ ఏమాయ చేసావే చిత్ర షూటింగ్ సమయంలోనే ఏర్పడింది. ఆ తరువాత అది దిన దిన ప్రవర్థమానం అవుతూ వచ్చింది. ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం కూడా. అయితే మా ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియనీయలేదు. చెబితే ఎలా రియాక్ట్ అవుతారోనన్న భయం. దీంతో చాలా కాలం అలా గడిచిపోయింది. సమంత ప్రేమ విషయం ఇంట్లో చెప్పమని అంటూ ఉండేది. అలా ఒక సారి సడన్‌గా నన్ను కలిసి మన ప్రేమ విషయం మీ ఇంట్లో వెంటనే చెప్పండి లేదా, రాఖీ కట్టేసి అన్నయ్యగా భావించేస్తాను అని పెద్ద షాక్ ఇచ్చింది. ఇక వేరే మార్గం లేక మా ఇంట్లో చెప్పేశాను. పెద్దలు సమ్మతించడంతో ఊపిరి పీల్చుకున్నాం అని నాగచైతన్య జోవియల్‌గా చెప్పిన విషయం ఇప్పుడు సోషల్‌మీడియాల్లో హల్చల్ చేస్తోంది. నాగచైతన్య, సమంత వేర్వేరు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటూనే పెళ్లి హడావుడిలో ఉన్నారు. వీరి పెళ్లి గోవాలో జరగనుంది.