ఆ ముచ్చటకు టైం వచ్చింది! | Nayanthara to marry Vignesh Shivan soon | Sakshi
Sakshi News home page

ఆ ముచ్చటకు టైం వచ్చింది!

Published Thu, Sep 28 2017 4:50 AM | Last Updated on Thu, Sep 28 2017 4:50 AM

Nayanthara to marry Vignesh Shivan soon

తమిళసినిమా: కల్యాణం వచ్చినా, కక్కు వచ్చినా ఆగదంటారు. అలాంటిది నటి నయనతార ప్రేమ ఇంతకు ముందు కలకలానికి దారి తీస్తే, పెళ్లి ఇప్పుడు సంచలనానికి దారి తీస్తోంది. అందానికి అందం ఈ పుత్తడిబొమ్మ.అందరికీ అందనిది ఈ మలయాళీ భామ అని నయనతారను అనవచ్చనుకుంటా. ఇంతకు ముందు నటుడు శింబు నయనతారను పొందాలనుకున్నారు.అయితే అది ప్రేమ వరకే సాగి ఆగిపోయింది.

ఆ తరువాత నటుడు ప్రభుదేవా సొంతం చేసుకోవాలనుకున్నారు. అది పెళ్లి వరకూ వచ్చి ఆగిపోయింది. ఈ రెండు సంఘటనలు నయనతార జీవితంలో మరచిపోలేని చేదు అనుభవాలేనని చెప్పక తప్పదు. అయినా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో వృత్తిపై ఆ ప్రభావం పడకుండా జాగ్రత్త పడిన నయనతార ప్రస్తుతం అగ్రనటిగా రాణిస్తున్నారు.అయితే ఆ అమ్మడు మూడోసారి ప్రేమలో పడి మరోసారి వార్తల్లోకెక్కారు.

దర్శకుడు విఘ్నేశ్‌శివ, నయనతార డీప్‌ లవ్‌లో పడిపోయారన్నది చాలా కాలంగానే గట్టిగా వినిపిస్తోంది. విఘ్నేశ్‌శివ, నయనతార కలిసి ఒకే ఇంటిలో సహజీవనం చేస్తున్నారన్న ప్రచారం జోరుగానే సాగుతోంది. అయినా ఇప్పటికీ వీరిద్దరిలో ఏ ఒక్కరూ తమ ప్రేమ గురించి గానీ, సహజీవనం సాగిస్తున్న విషయంగానీ బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు. ఇక తదుపరి ఘట్టం పెళ్లి. దానికీ సమయం ఆసన్నమైందనేది తాజా సమాచారం. నయనతారకిప్పుడు చేతినిండా చిత్రాలున్నాయి.

వాటిలో 90 శాతం హీరోయిన్‌ సెంట్రిక్‌ చిత్రాలే.  చక్రి తోలేటి దర్శకత్వంలో కొలైయుదీర్‌ కాలం చిత్రంతో పాటు ఆరమ్‌ చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ తాజాగా అరివళగన్‌ దర్శత్వంలో మరో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రంలో నటిం చడానికి అంగీకరించారు. శివకార్తికేయన్‌కు జంటగా నటించిన వేలైక్కారన్‌ చిత్రం నిర్మాణాంతర కార్యక్రామాలను జరుపుకుంటోంది. తెలుగులో చిరంజీవి సరసన సైరా నరసింహారెడ్డి అనే చారిత్రాత్మక చిత్రంలో నటిస్తున్న నయనతార ఈ చిత్ర షూటింగ్‌ సమయంలోనే విఘ్నేశ్‌శివతో పెళ్లి ముచ్చటకు రెడీ అవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తాజాగా ప్రచారం హల్‌చల్‌ చేస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement