Director vighnessiva
-
ఆ ముచ్చటకు టైం వచ్చింది!
తమిళసినిమా: కల్యాణం వచ్చినా, కక్కు వచ్చినా ఆగదంటారు. అలాంటిది నటి నయనతార ప్రేమ ఇంతకు ముందు కలకలానికి దారి తీస్తే, పెళ్లి ఇప్పుడు సంచలనానికి దారి తీస్తోంది. అందానికి అందం ఈ పుత్తడిబొమ్మ.అందరికీ అందనిది ఈ మలయాళీ భామ అని నయనతారను అనవచ్చనుకుంటా. ఇంతకు ముందు నటుడు శింబు నయనతారను పొందాలనుకున్నారు.అయితే అది ప్రేమ వరకే సాగి ఆగిపోయింది. ఆ తరువాత నటుడు ప్రభుదేవా సొంతం చేసుకోవాలనుకున్నారు. అది పెళ్లి వరకూ వచ్చి ఆగిపోయింది. ఈ రెండు సంఘటనలు నయనతార జీవితంలో మరచిపోలేని చేదు అనుభవాలేనని చెప్పక తప్పదు. అయినా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో వృత్తిపై ఆ ప్రభావం పడకుండా జాగ్రత్త పడిన నయనతార ప్రస్తుతం అగ్రనటిగా రాణిస్తున్నారు.అయితే ఆ అమ్మడు మూడోసారి ప్రేమలో పడి మరోసారి వార్తల్లోకెక్కారు. దర్శకుడు విఘ్నేశ్‌శివ, నయనతార డీప్ లవ్‌లో పడిపోయారన్నది చాలా కాలంగానే గట్టిగా వినిపిస్తోంది. విఘ్నేశ్‌శివ, నయనతార కలిసి ఒకే ఇంటిలో సహజీవనం చేస్తున్నారన్న ప్రచారం జోరుగానే సాగుతోంది. అయినా ఇప్పటికీ వీరిద్దరిలో ఏ ఒక్కరూ తమ ప్రేమ గురించి గానీ, సహజీవనం సాగిస్తున్న విషయంగానీ బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు. ఇక తదుపరి ఘట్టం పెళ్లి. దానికీ సమయం ఆసన్నమైందనేది తాజా సమాచారం. నయనతారకిప్పుడు చేతినిండా చిత్రాలున్నాయి. వాటిలో 90 శాతం హీరోయిన్ సెంట్రిక్ చిత్రాలే. చక్రి తోలేటి దర్శకత్వంలో కొలైయుదీర్ కాలం చిత్రంతో పాటు ఆరమ్ చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ తాజాగా అరివళగన్ దర్శత్వంలో మరో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో నటిం చడానికి అంగీకరించారు. శివకార్తికేయన్‌కు జంటగా నటించిన వేలైక్కారన్ చిత్రం నిర్మాణాంతర కార్యక్రామాలను జరుపుకుంటోంది. తెలుగులో చిరంజీవి సరసన సైరా నరసింహారెడ్డి అనే చారిత్రాత్మక చిత్రంలో నటిస్తున్న నయనతార ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే విఘ్నేశ్‌శివతో పెళ్లి ముచ్చటకు రెడీ అవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తాజాగా ప్రచారం హల్చల్ చేస్తోంది. -
మళ్లీ సొంత గూటికి నయన్
నటి నయనతార మళ్లీ సొంతగూటికి చేరారు అనగానే తనేదో మలయాళ చిత్రం చేస్తున్నారని అనుకునేరు.ఈ అమ్మడి వ్యక్తిగత జీవితం ఎప్పుడూ ఆసక్తికరం, ప్రశ్నార్థకమే అని చెప్పాలి. నటిగా లేడీసూపర్‌స్టార్‌గా రాణిస్తున్న నయనతార చాలా కాలం నక్షత్ర హోటళ్లలోనే బస చేస్తూ నిర్మాతలకు అదనపు భారాన్ని మోపుతూవచ్చారు. అలాంటిది ఆ మధ్య స్థానిక ఎగ్మూర్‌లో అధునాతన వసతులతో కూడిన ఒక అపార్టుమెంట్‌ను సొంతంగా కొనేసి అందులో నివసిస్తున్నారు. ఆ అపార్టుమెంట్లోనే తన తాజా ప్రేమికుడు, దర్శకుడు విఘ్నేశ్‌శివతో కలిసి సహజీవనం చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. అలాంటిది సడన్‌గా ఏమైందో ఏమోగానీ కొన్ని రోజుల నుంచి ఒక నక్షత్ర హోటల్లో రూమ్‌ను అద్దెకు తీసుకుని అందులో ఉంటున్నారు. దీంతో తాజా ప్రేమికుడితో ప్రేమ కథ అడ్డం తిరిగింది. తాను నటిస్తున్న వేలక్కారన్ చిత్ర షూటింగ్లో గాయాల పాలైన నయనతార చికిత్స పొందుతున్నారు లాంటి ప్రచారాలు హల్చల్ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సంచలన నటి నయనతార మళ్లీ ఎగ్మూర్‌లోని తన సొంత గూటికి మకాం మార్చారట. ఎందుకు హోటల్లో అద్దెకు రూమ్ తీసుకున్నారో, మళ్లీ ఎందుకు సొంత ప్లాట్‌కు చేరుకున్నారో తెలియని పరిస్థితి. దీంతో పోయెస్ గార్డెన్లో, అపోలో ఆస్పత్రిలో ఏం జరిగిందో తెలుసుకోవచ్చు గాని, నయనతార శింబు, ప్రభుదేవా, ఆర్యల నుంచి ఎందుకు దూరం అయ్యారో ఆ మర్మమేమిటో, అసలు ఆమె జీవితంలో రహస్యాలను తెలుసుకోవడం కష్టం అని కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అన్నట్టు ఆ మధ్య విజయ్‌సేతుపతికి జంటగా నానూమ్ రౌడీదాన్ చిత్రంలో నటించి ఆ చిత్ర మంచి విజయానికి ప్రధాన కారణంగా నిలిచి ఈ అమ్మడు తాజాగా అదే కథానాయకుడి 25వ చిత్రం సీతక్కాదిలో అతిథి పాత్రలో మెరిసే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం. -
నయనతార మళ్లీ మతం మారనున్నారా?
తమిళసినిమా : నటి నయనతార మళ్లీ మతం మారనున్నారా? ప్రస్తుతం కోలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్. కేరళాకు చెందిన నయనతార అయ్యా చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. అంతకు ముందే మలయాళ చిత్రాల్లో నటించారు. ఈమె అసలు పేరు డయానా. దర్శకుడు షాజీకైలాష్ నయనతారగా పేరు మార్చారు. ఆ దర్శకుడి నుంచి యువ దర్శకుడు విఘ్నేశ్‌శివ వరకూ పలువురితో ప్రేమ అంటూ నయనతారపై ప్రచారం కలకలం పుట్టిస్తూనే ఉంది. తమిళం, తెలుగు, మలయాళం భాషలలో ప్రముఖ నటిగా విరాజిల్లుతున్న నయనతార శింబుతో ప్రేమాయణం సాగించి ఆ తరువాత మనస్పర్థల కారణంగా ఆయనకు దూరం అయ్యారు. మరోసారి ప్రభుదేవాతో ప్రేమలో మునిగి ఆయనతో పెళ్లికి సిద్ధమయ్యారు. అప్పుడు ప్రభుదేవాతో పెళ్లికి మతం అడ్డుగా మారడంతో నయనతార హిందు మతాన్ని స్వీకరించారు. ఆ ప్రేమ పెళ్లి పీటలెక్కకపోవడంతో కొంతకాలం ప్రేమ వ్యవహారాలకు దూరంగా నటనపైనే పూర్తిగా దృష్టి సారించారు. అలా రీఎంట్రీలోనూ హీరోయిన్గా తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్న ఈ మలయాళీ భామ తాజాగా మాయ, తనీఒరువన్, నానుమ్ రౌడీదాన్ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టారు. కాగా నానుమ్ రౌడీదాన్ చిత్రం దర్శకుడు విఘ్నేశ్‌శివ తో మళ్లీ ప్రేమలో పడ్డారని, ఇద్దరు రహస్య వివాహం చేసుకున్నారని ప్రచారం జోరందుకుంది. నయనతార మంగళవారం ఇటలీలోని వాటిగన్ నగరంలో తన 31వ పుట్టిన రోజును జరుపుకున్నారు. అంతకు ముందే రోమ్ నగరం చేరుకున్న నయనతార అక్కడ క్రిష్టియన్ మత గురువు పోప్‌ను కలుసుకుని ఆయన ఆశీస్సులు పొందారు. ఈ సంఘటన చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశనీయంగా మారింది. క్రిష్టియన్ మతానికి చెందిన నయనతార ఇంతకు ముందు ప్రభుదేవాను పెళ్లి చేసుకోవడానికి హిందు మతాన్ని స్వీకరించారు. అలాంటిది ఇప్పుడు క్రిస్టియన్ మత గురువును కలిసి ఆశీస్సులు పొందడంలో నయనతార ఆంతర్యం ఏమిటి.. మళ్లీ ఆమె మతం మారనున్నారా? అనే పలు సందేహాలు ఫిలిం ఇండస్ట్రీలో తలెత్తుతున్నాయి. ఈ విషయంపై ఆమె ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.