నయనతార మళ్లీ మతం మారనున్నారా? | South Indian film actress Nayanthara changes religion | Sakshi
Sakshi News home page

నయనతార మళ్లీ మతం మారనున్నారా?

Published Fri, Nov 20 2015 2:21 AM | Last Updated on Sun, Sep 3 2017 12:43 PM

నయనతార మళ్లీ మతం మారనున్నారా?

నయనతార మళ్లీ మతం మారనున్నారా?

 తమిళసినిమా : నటి నయనతార మళ్లీ మతం మారనున్నారా? ప్రస్తుతం కోలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్. కేరళాకు చెందిన నయనతార అయ్యా చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. అంతకు ముందే మలయాళ చిత్రాల్లో నటించారు. ఈమె అసలు పేరు డయానా. దర్శకుడు షాజీకైలాష్ నయనతారగా పేరు మార్చారు. ఆ దర్శకుడి నుంచి యువ దర్శకుడు విఘ్నేశ్‌శివ వరకూ పలువురితో ప్రేమ అంటూ నయనతారపై ప్రచారం కలకలం పుట్టిస్తూనే ఉంది. తమిళం, తెలుగు, మలయాళం భాషలలో ప్రముఖ నటిగా విరాజిల్లుతున్న నయనతార శింబుతో ప్రేమాయణం సాగించి ఆ తరువాత మనస్పర్థల కారణంగా ఆయనకు దూరం అయ్యారు.
 
 మరోసారి ప్రభుదేవాతో ప్రేమలో మునిగి ఆయనతో పెళ్లికి సిద్ధమయ్యారు. అప్పుడు ప్రభుదేవాతో పెళ్లికి మతం అడ్డుగా మారడంతో నయనతార హిందు మతాన్ని స్వీకరించారు. ఆ ప్రేమ పెళ్లి పీటలెక్కకపోవడంతో కొంతకాలం ప్రేమ వ్యవహారాలకు దూరంగా నటనపైనే పూర్తిగా దృష్టి సారించారు. అలా రీఎంట్రీలోనూ హీరోయిన్‌గా తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్న ఈ మలయాళీ భామ తాజాగా మాయ, తనీఒరువన్, నానుమ్ రౌడీదాన్ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టారు. కాగా నానుమ్ రౌడీదాన్ చిత్రం దర్శకుడు విఘ్నేశ్‌శివ తో మళ్లీ ప్రేమలో పడ్డారని, ఇద్దరు రహస్య వివాహం చేసుకున్నారని ప్రచారం జోరందుకుంది.
 
  నయనతార మంగళవారం ఇటలీలోని వాటిగన్ నగరంలో తన 31వ పుట్టిన రోజును జరుపుకున్నారు. అంతకు ముందే రోమ్ నగరం చేరుకున్న నయనతార అక్కడ క్రిష్టియన్ మత గురువు పోప్‌ను కలుసుకుని ఆయన ఆశీస్సులు పొందారు. ఈ సంఘటన చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశనీయంగా మారింది. క్రిష్టియన్ మతానికి చెందిన నయనతార ఇంతకు ముందు ప్రభుదేవాను పెళ్లి చేసుకోవడానికి హిందు మతాన్ని స్వీకరించారు. అలాంటిది ఇప్పుడు క్రిస్టియన్ మత గురువును కలిసి ఆశీస్సులు పొందడంలో నయనతార ఆంతర్యం ఏమిటి.. మళ్లీ ఆమె మతం మారనున్నారా? అనే పలు సందేహాలు ఫిలిం ఇండస్ట్రీలో తలెత్తుతున్నాయి. ఈ విషయంపై ఆమె ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement