మళ్లీ ప్రేమలో పడ్డారా? | Nayanthara in love with Simbu, again ? | Sakshi
Sakshi News home page

మళ్లీ ప్రేమలో పడ్డారా?

Published Sun, Sep 7 2014 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 PM

మళ్లీ ప్రేమలో పడ్డారా?

మళ్లీ ప్రేమలో పడ్డారా?

చిత్ర విచిత్రాలకు నెలవు సినిమా పరిశ్రమ. ఇక్కడ ప్రేమ విషయానికొస్తే ఎవరు ఎప్పుడు ప్రేమించుకుంటారో ఎప్పుడు విడిపోతారో మళ్లీ ఎప్పుడు ఎలా కలుస్తారో ఎవరికీ తెలియదు.  నటుడు శింబు నయనతార ప్రేమాయణం గురించి తెలియని వారుండరు. అయితే వీరి ప్రేమ మొదట్లో విచ్ఛిన్నం అయ్యింది. దీంతో నయనతార తమిళ చిత్రాలకే దూరమయ్యారు. తెలుగులో బిజీగా నటిస్తున్న సమయంలో నటుడు, నృత్య దర్శకుడు ప్రభుదేవాతో నయనతార ప్రేమలో పడ్డారు. వీరి గాఢమైన ప్రేమ పెళ్లి పీటల వరకు వచ్చి పెటాకులైంది. ఈ మధ్యలో నటుడు శింబు, హన్సికల మధ్య పరిచయం ప్రేమకు దారి తీసింది.
 
 వీరి పెళ్లి ఖాయం అన్నంతగా ప్రచారం జరిగింది. శింబు హన్సికలిద్దరూ ప్రేమపెళ్లి విషయాలను ఖరారు చేయడమే ఇందుకు కార ణం. ఆ ప్రేమ కూడా పెళ్లి పీటలెక్క లేదు. అసలు విషయమేమిటంటే బద్ధ శత్రువులుగా మారిన మాజీ ప్రేమికులు శింబు నయనతార మళ్లీ కలిసి నటించడం. అదీ శింబు సొంత చిత్రంలో నయనతార నటించడం. ఇంకేముంది మళ్లీ ఈ జంట చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. అదేమంటే శింబును సహ నటుడిగానే చూస్తున్నానని నయతార, తాను సహనటిగానే ప్రవర్తిస్తున్నట్టు శింబు వివరణ ఇస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది.
 
 ఇటీవల ఒక ప్రీమియం షోకు ఈ సంచలన జంట కలిసి రావడంతో మళ్లీ కోలీవుడ్‌లో కలకలం రేకెత్తుతోంది. చెన్నైలోని ఎస్కేప్ థియేటర్‌లో ప్రదర్శించిన నటుడు ఆర్య నిర్మించిన అమరకావ్యం చిత్రానికి శింబు, నయతార కలిసి రావడంతో ఫొటోగ్రాఫర్లు కెమెరాలకు పని చెప్పారు. అభిమానులు వారిని చూడటానికి ఎగపడ్డారు. చివరికి థియేటర్ సిబ్బంది ఈ  జంటకు రక్షణగా నిలిచి థియేటర్‌లోనికి తీసుకెళ్లవలసి వచ్చింది. శింబు, నయనతార పక్కపక్కనే కూర్చుని చిత్రాన్ని తిలకించారు.
 
 దీంతో వీరిద్దరూ మళ్లీ ప్రేమలో పడ్డారా? అన్న రకరకాల ఆలోచనలకు కోలీవుడ్ తెర లేపింది. కొసమెరుపు ఏమిటంటే ఇంతకుముందు ఒక ప్రశ్నకు నయనతార శింబునయినా క్షమిస్తాను కానీ ప్రభుదేవాను మన్నించనని స్టేట్‌మెంట్ ఇచ్చారన్న విషయం ఇప్పుడు కోడంబాక్కంలో గుసగుసలకు ఆస్కారం ఇస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement