ప్రభుదేవాతో తమన్నా ప్రేమలో పడిందా? | Prabhu Deva love affair with Tamanna? | Sakshi
Sakshi News home page

ప్రభుదేవాతో తమన్నా ప్రేమలో పడిందా?

Oct 8 2016 1:36 AM | Updated on Sep 4 2017 4:32 PM

ప్రభుదేవాతో తమన్నా ప్రేమలో పడిందా?

ప్రభుదేవాతో తమన్నా ప్రేమలో పడిందా?

డ్యాన్సింగ్ కింగ్ ప్రభుదేవాకు మిల్కీబ్యూటీ తమన్నా క్లోజ్ అయ్యారా? వీరి మధ్య ప్రేమ వ్యవహారం సాగుతోందా?

డ్యాన్సింగ్ కింగ్ ప్రభుదేవాకు మిల్కీబ్యూటీ తమన్నా క్లోజ్ అయ్యారా? వీరి మధ్య ప్రేమ వ్యవహారం సాగుతోందా? తాజాగా సినీ వర్గాల్లో జరుగుతున్న హాట్ హాట్ టాపిక్ ఇదే. కోలీవుడ్, టాలీవుడ్ దాటి దర్శకుడిగా బాలీవుడ్‌లో జెండా పాతిన నృత్యదర్శకుడు నటుడు ప్రభుదేవా. చాలా గ్యాప్ తరువాత ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి కథానాయకుడిగా నటించిన చిత్రం దేవి. తమిళం, తెలుగు, హిందీ  భాషల్లో రూపొందిన ఈ చిత్రంలో తమన్నా కథానాయకిగా నటించారు.

సాధారణంగా తమన్నా చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. అలాంటిది దేవి చిత్ర ప్రచార కార్యక్రమంలో ప్రభుదేవాతో కలిసి పాల్గొనడం పెద్ద చర్చకే దారి తీసింది. తీగ లాగితే డొంక కదిలినట్లు దేవి చిత్ర ప్రచార కార్యక్రమంలో కలిసి పాల్గొన్న ప్రభుదేవా, తమన్నా ఒకరి నొకరు పొగడ్తలతో ముంచెత్తుకోవడంతో వారి గురించి  పరిశ్రమ వర్గాల్లో ఇప్పుడు గుసగుసలు మొదలయ్యాయి. దేవి చిత్ర షూటింగ్‌లోనే ప్రభుదేవా, తమన్నాల మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, ఇద్దరు చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారని రకరకాల వదంతులు హల్‌చల్ చేస్తున్నాయి.

అంతే కాదు వీరి మధ్య ప్రేమాయణం లాంటిది జరుగుతోందని ఒక టాలీవుడ్ దర్శకుడు తెలిపినట్లు తమిళ పత్రికలు ప్రచురించడం గమనార్హం. ఇప్పటి వరకూ తమన్నాపై ఇలాంటి ప్రేమ వదంతులు పుట్టలేదు. బహుశ ఇదే ప్రప్రథమం అనుకోవచ్చు. ఇకపోతే ప్రభుదేవా ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. నటి నయనతారతో ప్రేమ పెళ్లి వరకూ వెళ్లి ఆగిపోయిన విషయం తెలిసిందే. అదే విధంగా అంతకు ముందే పెళ్లి అయిన ఆయన తన భార్య రమలత్ నుంచి విడాకులు పొందారన్నది గమనార్హం.

 ప్రభుదేవాకిప్పుడు 43 ఏళ్లు. ఇంట్లో మరో పెళ్లి చేసుకోమని ఒత్తిడి పెరుగుతున్నట్లు సినీ వర్గాల సమాచారం. అదే విధంగా ఇప్పటి వరకూ ఎలాంటి ప్రేమ వివాదంలోనూ చిక్కుకోని తమన్నా తాజాగా ప్రభుదేవాపై మనసు పడ్డట్టు వదంతులు ప్రచారం అవుతున్నాయి. మరి ఈ వ్యవహారంలో వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తేగానీ అసలు విషయం తెలుస్తుంది. నిజం ఏమిటో నిలకడ మీదే తెలుస్తుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement