
‘ఎవరి చిన్నప్పటి ఫొటోలు వారికి ముద్దు’ అని లోకం అనుకున్నా సరే అవి అంటే మనకు ఎంతో ఇష్టం. ఇక సెలబ్రిటీల చిన్నప్పటి ఫొటోలు ఎప్పుడూ హాట్ ఫేవరెట్టే! ఒకప్పుడు ‘ ఇవిగో మీ అభిమాన హీరో చిన్నప్పటి ఫోటో’ అంటే ఆశ్చర్యానందాలతో చూసేవాళ్లం. ఇప్పుడు మాత్రం ఏఐ పుణ్యమా అని నమ్మడానికి లేదు. ఏది నిజం ఏది ఏఐ!
ఏఐ టెక్నాలజీ హవా చూస్తుంటే ఇక ముందు హీరో, హీరోయిన్‌ల చిన్నప్పటి పాత్రలు బాల నటులు వేయాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది. ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్న షారుఖ్ ఖాన్, రజనీకాంత్, నయన తార, మోహన్‌లాల్... చిన్ననాటి ఫొటోలే దీనికి నిదర్శనం. కాస్త సరదా అంశ కూడా వీటికి చేర్చడం వల్ల ఇవి ఏఐ ట్రాన్స్‌ఫర్‌మేషన్ ఇమేజ్‌లు అని తెలిసిపోతుందిగానీ...లేకపోతే శానా కష్టం సుమీ!
Comments
Please login to add a commentAdd a comment