చెప్పకుంటే రాఖీ కట్టేస్తా! | Tell us about our love story right away | Sakshi
Sakshi News home page

చెప్పకుంటే రాఖీ కట్టేస్తా!

Published Thu, Sep 7 2017 3:53 AM | Last Updated on Sun, Sep 17 2017 6:29 PM

చెప్పకుంటే రాఖీ కట్టేస్తా!

చెప్పకుంటే రాఖీ కట్టేస్తా!

తమిళసినిమా: లేకపోతే రాఖీ కట్టేసి అన్నయ్యగా ఫిక్స్‌ అయిపోతా! ఏమిటి తలా, తోక లేని రాతలు అనుకుంటున్నారా? అయితే రండి విషయంలోకి వెళదాం. చెన్నై చిన్నది సమంత, తెలంగాణ అందగాడు నాగచైతన్య డీప్‌ లవ్‌లో ఉన్న సంగతి గురించి తెలిసిందే. ఈ లవర్స్‌ వచ్చే నెల (అక్టోబర్‌) ఆరో తేదీ అగ్నిసాక్షిగా ఏడడుగులు వేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఆ అందమైన జంట ప్రేమకు ఎక్కడ బీజం పడిండి, పెళ్లి ఎలా ఖాయం అయ్యిందన్న విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి చాలా మందిలో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

నటుడు నాగచైతన్య తాజాగా లావణ్యా త్రిపాఠితో కలిసి రొమాన్స్‌ చేసిన చిత్రం యుద్ధం చరణం. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా నాగచైతన్యను సమంతతో ప్రేమాయణం గురించి అడగ్గా చాలా ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు.అవేమిటో చూద్దాం. సమంతతో ప్రేమ ఏమాయ చేసావే చిత్ర షూటింగ్‌ సమయంలోనే ఏర్పడింది. ఆ తరువాత అది దిన దిన ప్రవర్థమానం అవుతూ వచ్చింది. ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం కూడా. అయితే మా ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియనీయలేదు. చెబితే ఎలా రియాక్ట్‌ అవుతారోనన్న భయం. దీంతో చాలా కాలం అలా గడిచిపోయింది.

సమంత ప్రేమ విషయం ఇంట్లో చెప్పమని అంటూ ఉండేది. అలా ఒక సారి సడన్‌గా నన్ను కలిసి మన ప్రేమ విషయం మీ ఇంట్లో వెంటనే చెప్పండి లేదా, రాఖీ కట్టేసి అన్నయ్యగా భావించేస్తాను అని పెద్ద షాక్‌ ఇచ్చింది. ఇక వేరే మార్గం లేక మా ఇంట్లో చెప్పేశాను. పెద్దలు సమ్మతించడంతో ఊపిరి పీల్చుకున్నాం అని నాగచైతన్య జోవియల్‌గా చెప్పిన విషయం ఇప్పుడు సోషల్‌మీడియాల్లో హల్‌చల్‌ చేస్తోంది. నాగచైతన్య, సమంత వేర్వేరు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటూనే పెళ్లి హడావుడిలో ఉన్నారు. వీరి పెళ్లి గోవాలో జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement