
చకచకా సినిమాలు చేస్తూ వస్తోన్న సూపర్‌స్టార్ రజనీకాంత్.. తన తదుపరి చిత్రషూటింగ్‌లో బిజీ అయ్యారు. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ‘దర్బార్’ చిత్రం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతుండగా.. విరామ సమయంలో యూనిట్‌సేద తీరింది. తాజాగా వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్‌చేస్తున్నాయి.
ఇటీవలె ముంబై షెడ్యూల్ ప్లాన్ చేసిన చిత్రయూనిట్‌కు లీకుల బెడద తప్పడం లేదు. సన్నివేశాలు, ఫోటోలు లీక్ అవుతూనే ఉన్నాయి. తాజాగా చిత్రయూనిట్ షూటింగ్ విరామ సయమంలో క్రికెట్ ఆడిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రజనీ బ్యాట్ పట్టి సిక్సుల మోత మోగిస్తున్నారేమో. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా.. నివేధా థామస్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment