
నయనతార తన అభిమాన నటుడు ఆయనే అంటున్నారు. ఇంతకి ఎవరు ఆయన అనుకుంటున్నారా.? అక్కడికే వస్తున్నా.. ఇటీవల నయనతారను మీ అభిమాన నటుడు ఎవరు అని అడిగితే కొంచెం కూడా ఆలోచించకుండా వెంటనే ‘అజిత్’ అని చెప్పింది. అంతేకాదు నటుడు విజయ్ కూడా తన అభిమాన హీరోనే అని చెప్పారు. ఇదిలా ఉండగా అజిత్ తాజా సినిమా విశ్వాసంలో నయన్ నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం కోలీవుడ్‌లో వైరల్ అవుతోంది. ఈ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. గతంలో నయన్ అజిత్‌తో ‘ఏకన్’ సినిమాలో జత కట్టారు.
నయనతారా అయ్యా సినిమాతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం మంచి విజయాన్ని అందించినా.. నయన్‌కు పేరు తెచ్చిన సినిమా మాత్రం సూపర్‌స్టార్‌తో నటించిన చంద్రముఖి, నయన్ తన 13 సినీ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశారు. రజనీకాంత్ నుంచి విజయ్, అజిత్, శింబు, ధనుష్ , వర్థమాన నటుడు ఆరి వరకూ కోలీవుడ్‌లో నటించింది. ప్రస్తుతం లేడీ సూపర్‌స్టార్‌గా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల ఆమె నటించిన అరమ్ చిత్రం విమర్శకులను సైతం మెప్పించి కలెక‌్షన్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం తెలుగులో రెండు , తమిళంలో మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment