
ఇప్పటివరకు దక్షిణాది చిత్రాలకే పరిమితమైప నయనతార తొలిసారిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ సినిమాలో జోడీ కట్టేందుకు రెడీ అవుతుంది ఈ లేడీ సూపర్ స్టార్. డైరెక్టర్ అట్లీ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. గత పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ కెరీర్‌లో సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకెళ్తున్న నయనతార ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టి పెట్టింది. అంతేకాకుండా రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేసింది ఈ భామ. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.3-5 కోట్ల వరకు తీసుకునే నయనతార ఇప్పుడు బాలీవుడ్ డెబ్యూ కోసం రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచేసింది.
బాలీవుడ్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని రూ.6-8 కోట్ల రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేసిందట. కథలో దక్షిణాది నేపథ్యం ఉండటతో నయన్ తీసుకున్నట్లు సమాచారం. ఇండస్ట్రీ మారేసరికి నయన్ రేటు పెంచడంతో నిర్మాతలు షాక్ అయ్యారట. ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో నయన్ పేరు ముందుంటుంది. అలాంటిది ఇప్పుడు బాలీవుడ్ డెబ్యూ అనగానే పారితోషికాన్ని డబుల్ చేయడంతో ఇక చేసేదేం లేక అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment