మెరుపు వేగంతో... | hero gopichand new movie updates | Sakshi
Sakshi News home page

మెరుపు వేగంతో...

Published Fri, Apr 28 2017 12:28 AM | Last Updated on Tue, Sep 5 2017 9:50 AM

మెరుపు వేగంతో...

మెరుపు వేగంతో...

జోరున వర్షం. ఆరడుగుల వ్యక్తి ఇటు వైపు.. అరడజనుకు పైగా రౌడీలు అటువైపు. ఎంతమంది రౌండప్‌ చేసినా కన్‌ఫ్యూజన్‌ లేకుండా రఫ్ఫాడించే దమ్మున్న వ్యక్తి అతను. ఇంకేముంది? ఒంటి చేత్తో మెరుపు వేగంతో అందర్నీ మట్టి కరిపించాడు. అంతే వేగంతో బుల్లెట్‌ తీశాడు. ఇంతకీ ఆ రౌడీలు ఇతగాణ్ణి ఎందుకు రౌండప్‌ చేశారు? అసలు కథ ఏంటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. గోపీచంద్, నయనతార జంటగా జయా బాలాజీ రియల్‌ మీడియా పతాకంపై బి.గోపాల్‌ దర్శకత్వంలో తాండ్ర రమేష్‌ నిర్మిస్తున్న చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్‌’.

ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం మే 19 న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ– ‘‘చిరంజీవి, బాలకృష్ణ వంటి టాప్‌ హీరోలకు బి.గోపాల్‌ మంచి హిట్స్‌ ఇచ్చారు. ఫ్యామిలీ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. బి.గోపాల్‌ అద్భుతంగా తెరకెక్కించారు. వంశీ కథ, అబ్బూరి రవి మాటలు, మణిశర్మ సంగీతం సినిమాకి హైలెట్‌. గోపీచంద్‌ కెరీర్‌లో ఈ చిత్రం ఓ మైలురాయిగా మిగులుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: నారాయణ రెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement