
పైసూల్‌ను అరెస్టు చేయూలి
కోర్టు మూడు సార్లు ముందస్తు బెయిల్ నిరాకరించినప్పటికీ నిర్మాత పైసూల్‌ను పోలీసులు అరెస్టు చేయలేదని, ఆయన్ను వెం టనే అరెస్టు చేయాలని నటి రాధ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
కోర్టు మూడు సార్లు ముందస్తు బెయిల్ నిరాకరించినప్పటికీ నిర్మాత పైసూల్‌ను పోలీసులు అరెస్టు చేయలేదని, ఆయన్ను వెం టనే అరెస్టు చేయాలని నటి రాధ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. సినీ నిర్మాత, వ్యాపారవేత్త పైసూల్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆరేళ్లు సహజీవనం చేసి చివరికి మోసం చేశారని, రూ.50 లక్షలు తీసుకుని తిరిగి చెల్లించలేదని సుందరం ట్రావెల్స్ చిత్రం ఫేమ్ నటి రాధ సంచలన ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిన పైసూల్ చెన్నై కోర్టులో ముందస్తు బెయిల్ కోసం మూడు సార్లు ప్రయత్నించి నిరాకరణకు గురయ్యారు. ఆయనను వెంటనే అరెస్టు చేయాలని నటి రాధ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కొందరు పైసూల్‌ను కాపాడే యత్నం చేస్తున్నారని, వారెవరో త్వరలోనే బయటపెడతానని చెప్పారు. తనకు మహి ళా సంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయని తెలిపారు.