Senior Actress Radha Thanks To Rajinikanth On Twitter, Tweet Viral - Sakshi
Sakshi News home page

Actress Radha: రజనీకి థ్యాంక్స్‌ చెప్పిన అలనాటి హీరోయిన్‌ రాధ, ట్వీట్‌ వైరల్‌

Published Fri, Nov 11 2022 10:13 AM | Last Updated on Fri, Nov 11 2022 11:27 AM

Senior Actress Radha Thanks to Rajinikanth on Twitter - Sakshi

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం నెల్సన్‌ దర్శకత్వంలో జైలర్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. కాగా రజనీకాంత్‌ వారసురాలు ఐశ్వర్య దర్శకత్వంలో అతిథి పాత్రలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ పాత్ర భాషా చిత్రంలోని పాత్ర తరహాలో అదిరిపోయేలా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ విషయాన్ని అటుంచితే 1980 ప్రాంతంలో రజనీకాంత్, నటి రాధ సూపర్‌హిట్‌ జంట. వీరు ఏడు చిత్రాల్లో కలిసి నటించారు. ఇందులో అధిక శాతం సూపర్‌హిట్‌ అయ్యాయి.

చదవండి: భర్తకు దూరంగా ఉంటున్న నటి స్నేహ! కారణం ఇదేనా?

కాగా పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రజనీకాంత్‌ వేదికపై మాట్లాడుతూ తాను ఈ నవల చదివినప్పుడు దీనిని సినిమాగా తీస్తే తాను వాందియదేవన్‌గాను, అరుళ్‌మొళి వర్మగా కమలహాసన్, ఆదిత్య కరికాలన్‌గా విజయ్‌కాంత్, పెరియ పళవేటరైయార్‌గా సత్యరాజ్, నందినిగా హిందీ నటి రేఖ, కుందవైగా శ్రీదేవి, పూంగళిగా రాధ నటిస్తే బాగుంటుందని భావించానన్నారు. ఇది జరిగి చాలా రోజులు అయినా నటి రాధ చెవికి ఇప్పుడు చేరినట్లు ఉంది. ఆమె ఆలస్యంగా స్పందించారు. రాధ ట్విట్టర్లో పూంగళి పాత్రలో తాను నటిస్తే బాగుంటుందని చెప్పిన తలైవాకు ధన్యవాదాలు అని అన్నారు. 


    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement