
రాధను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం
బుచ్చిరెడ్డిపాళెం: భర్త ఇంటి ముందు న్యాయపోరాటం చేస్తున్న భార్య రాధ ఆదివారం ఒక్కసారిగా సొమ్మసిల్లి తల్లి ఒడిలో పడిపోయింది. అక్కడి నుంచి రాధను 108 వాహనంలో నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రాధకు చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా రాధ తల్లి జయమ్మ మాట్లాడుతూ తన కుమార్తెను ఆమె అత్త, మామలైన «శ్రీనివాసులురెడ్డి, శ్రీనివాసమ్మ మోసం చేసి ప్రసాద్‌రెడ్డితో పెళ్లి జరిపించాన్నారు. ప్రసాదర్‌రెడ్డి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అని చెప్పి మాయమాటలు చెప్పాడన్నారు. తన కుమార్తె వాళ్ల ఇంటి ముందు బైఠాయించినా నేటికీ పట్టించుకోవడం లేదన్నారు. తన కుమార్తెకు న్యాయం చేయాలని ఆమె కోరారు.