రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని చితకబాదిన నటి రాధ | Sundhara Travels Actress Radha attack on Real estate man | Sakshi
Sakshi News home page

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని చితకబాదిన నటి రాధ

Published Tue, Apr 30 2024 7:06 AM | Last Updated on Tue, Apr 30 2024 7:55 AM

Sundhara Travels Actress Radha attack on Real estate man

సుందరా ట్రావెల్స్‌ చిత్ర కథానాయకి మరో వివాదంలో చిక్కుకున్నారు. దీంతో పోలీసులు కేసు గురించి విచారణ జరుపుతున్నారు. వివరాలు చూస్తే.. చెన్నై, నెర్కుం  డ్రం, పల్లవన్‌నగర్‌ సమీపంలోని ఏరిక్కరై వీధికి చెందిన వ్యక్తి మురళీకృష్ణన్‌ (48) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో పాటు, ఎల్‌ఐసీ ఏజెంట్‌గానూ వ్యవహరిస్తున్నారు. మురళీకృష్ణన్‌ మాట్లాడుతూ ద్వారకేశ్‌ అనే తన మిత్రుడికి నటి రాధ పరిచయం చేశానన్నారు. 

దీంతో ఆమె రెండేళ్ల క్రితం 90 వేలు బిట్‌ కాయిన్స్‌ పె ట్టుబడి పెట్టారన్నారు. అయితే అప్పటినుంచి అత ను ఆ బిట్‌ కాయిన్స్‌ను నటి రాధకు తిరిగి చెల్లించలేదన్నారు. దీంతో నటి రాధ ద్వారకేశ్‌ను పరిచయం చేసిన తనను ఆ బిట్‌ కాయిన్స్‌ తిరిగి చెల్లించాల్సిందిగా ఒత్తిడి చేశారన్నారు. అలా రాధ, ఆమె తల్లి పల్లవి, కొడుకు మరో ముగ్గురు స్థానిక చూలైమేడులోని తన కార్యాలయానికి వచ్చి గొడవ చేశారన్నారు. 

వాగ్వాదం తరువాత నటి రాధ తనను కిందకు పడేసి కొట్టారన్నారు. దీంతో తన అనుచరు లు స్థానిక రాయపేటలోని ప్రభుత్వాస్పత్రిలో చేర్చారని, తన తలకు మూడు కుట్లు పడ్డాయని చె ప్పారు. అనంతరం తాను స్థానిక వడపళనిలో పోలీస్‌స్టేషన్‌లో నటి రాధ, ఆమె కుటుంబసభ్యులపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కాగా పోలీసులు ఈ వ్యహారంపై విచారణ జరుపుతున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement