హోం మినిస్టర్‌గా వెంకటేష్ | venkatesh as home minister | Sakshi
Sakshi News home page

హోం మినిస్టర్‌గా వెంకటేష్

Published Thu, Dec 19 2013 12:26 AM | Last Updated on Sat, Sep 2 2017 1:45 AM

వెంకటేష్

వెంకటేష్

27 ఏళ్ల కెరీర్‌లో వెంకటేష్ ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారు కానీ, పొలిటికల్ లీడర్‌గా మాత్రం నటించలేదు. త్వరలో ఆ లోటు కూడా తీరిపోనుంది. మారుతి దర్శకత్వంలో నటించడానికి వెంకీ పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. ‘రాధ’ అనే టైటిల్‌ని కూడా ఖరారు చేసిన ఆ సినిమాలో వెంకటేష్ హోం మినిస్టర్‌గా కనిపించబోతు న్నారు. ఈ చిత్రానికి ‘ది హోం మినిస్టర్స్ హానరబుల్ లవ్’ అనేది ఉపశీర్షికగా నిర్ణయించనున్నట్లు సమాచారం.

టైటిల్, ఉపశీర్షిక, వెంకీ పాత్ర... ఈ మూడింటి బట్టీ చూస్తే... దర్శకుడు మారుతి ఈ సినిమా విషయంలో ఏదో కొత్తగా ప్రయత్నం చేస్తున్నట్లు అర్థమవుతోంది. ‘ఈ రోజుల్లో’, ‘బస్‌స్టాప్’, ‘ప్రేమకథా చిత్రమ్’ చిత్రాలతో దర్శకునిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న మారుతి... ఇప్పటివరకూ తాను తీసిన చిత్రాలకు భిన్నంగా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని వినికిడి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సెటైరిక్‌గా శంకర్ ‘ఒకే ఒక్కడు’ రేంజ్‌లో ఈ చిత్రం ఉండబోతుందని సమాచారం. సంక్రాంతికి ఈ చిత్రం సెట్స్‌కి వెళ్లనుందని తెలిసింది. మే నెలలో సమ్మర్ స్పెషల్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాత డీవీవీ దానయ్య భావిస్తున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement