శ్రీదేవి బెస్ట్.. రాధ డాన్స్ సూపర్: చిరంజీవి | Sridevi best for me, says Chiranjeevi | Sakshi
Sakshi News home page

శ్రీదేవి బెస్ట్.. రాధ డాన్స్ సూపర్: చిరంజీవి

Published Sun, Sep 7 2014 10:33 PM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM

శ్రీదేవి బెస్ట్.. రాధ డాన్స్ సూపర్: చిరంజీవి

శ్రీదేవి బెస్ట్.. రాధ డాన్స్ సూపర్: చిరంజీవి

తన సరసన నటించిన హీరోయిన్లలో శ్రీదేవి బెస్ట్ అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. రాధ డాన్స్ చేస్తుందని తెలిపారు. జగదేకవీరుడు- అతిలోక సుందరి రీమేక్ లో తన కుమారుడు చరణ్, తమన్నా కలిసి నటించాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. అతిలోకసుందరిగా తమన్నాయే కరెక్ట్ అని అన్నారు. ఆమె వృతి నిబద్దత గల నటి అని ప్రశంసించారు.

ఈ సినిమాకు దర్శకుడిగా కె. రాఘవేంద్రరావును తప్ప మరొకరిని ఊహించలేమని చెప్పారు. అశ్వనీదత్ నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తాను ప్రేక్షకుడిగా ఈ సినిమా చూస్తానంటూ చిరంజీవి చమత్కరించారు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ సినిమాలు చేస్తున్న సమయంలో తాను సినిమా రంగంలో ఉండడం తనకెంతో గర్వకారణమని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement