ఫ్యాన్స్‌కి తీపి కబురు అందించిన నటి రాధ, మళ్లీ వస్తు‍న్నానంటూ ట్వీట్‌.. | Senior Actress Radha Re Entry To Small Screen After Pretty Long Gap | Sakshi
Sakshi News home page

Actress Radha: ఫ్యాన్స్‌కి తీపి కబురు అందించిన నటి రాధ, మళ్లీ వస్తు‍న్నానంటూ ట్వీట్‌..

Published Wed, Jan 12 2022 3:07 PM | Last Updated on Wed, Jan 12 2022 6:45 PM

Senior Actress Radha Re Entry To Small Screen After Pretty Long Gap - Sakshi

Senior Actress Radha Re Entry To Small Screen After Long Gap: అలనాటి హీరోయిన్‌, ప్రముఖ సీనియర్‌ నటి రాధ.. అప్పటి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా ప్రత్యేకం పరిచయం అక్కర్లేని పేరు. తన అందం, అభినయం, నటన.. అంతకు మించి డ్యాన్స్‌తో ఎంతో ప్రేక్షకులను గుండెల్లో ఆమె నిలిచిపోయారు. 80, 90 దశకంలో ఆనాటి అగ్ర హీరోలు సూపర్‌ స్టార్‌ కృష్ణ, మెగాస్టార్‌ చిరంజీవి, బాలకృష్ణతో పలువురి హీరోలందరి సరసన ఆమె నటించారు. మెగాస్టార్‌ చిరంజీవి, బాలయ్యలతో పోటీ పోడుతూ డ్యాన్స్‌ చేసి పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

చదవండి: ‘బంగార్రాజు’ ట్రైలర్‌ వచ్చేసింది, చై హంగామా మామూలుగా లేదుగా..

అలా స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రాధ తమిళ్‌, మలయాళంలో కూడా హీరోయిన్‌గా నటించారు.అక్కడ కూడా ఆమె స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందారు. ఈ క్రమంలో రానూరానూ సినిమాలు తగ్గించిన రాధ పెళ్లి చేసుకుని పూర్తిగా నటనకు దూరమయ్యారు. భర్త, పిల్లలు, వ్యాపారంతో బిజీ అయిపోయారు. ఆమె తెరపై కనిపించి ఓ దశాబ్దమే గడిచింది. ఈక్రమంలో అప్పుడప్పుడు పలు ఈవెంట్స్‌లో మెరిసిన ఆమె పూర్తిస్థాయిలో తెరపై కనిపించలేదు. ఇదిలా ఉంటే తన ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేసే ఓ తీపి కబురు అందించారు రాధ. మళ్లీ వస్తున్నానంటూ ఆమె ట్వీట్‌ చేశారు.

చదవండి: సల్మాన్‌ ఖాన్‌తో సీక్రెట్‌ డేటింగ్‌, క్లారిటీ ఇచ్చిన నటి సమంత..

ఈ మేరకు రాధ ట్వీట్‌ చేస్తూ.. త్వరలో బుల్లితెరపై సందడి చేయబోతున్నానంటూ ఓ షో ప్రోమోను వదిలారు. ‘చాలా గ్యాప్‌ తర్వాత మళ్లీ వస్తున్నా.  ఓ రియాలిటీ షోకు న్యాయనిర్థేతగా వ్యవహరించేందుకు బుల్లితెరపైకి వస్తున్నాను. నా కో-జడ్జీగా నకుల్‌ వ్యవహరిస్తున్న ఈ సూపర్‌ క్వీన్స్‌ షో జీ తమిళ్‌లో ప్రసారం కాబోతోంది. ఈ షోకు జడ్జీగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి క్షణాన్ని ఎంజాయ్‌ చేస్తున్నా. ఎంతోమంది అమ్మాయిల ప్రతిభను ఈ కార్యక్రమం ద్వారా చూడటం గర్వంగా ఉంది’ అంటూ రాసుకొచ్చారు. 90వ దశకంలో సినీ రంగానికి గుడ్ బై చెప్పిన రాధ పెళ్లి తర్వాత ముంబయిలో సెటిలయ్యారు. అడపాదడపా ఈవెంట్లలో దర్శనమిస్తూ అభిమానులను అలరించడం తప్ప హోస్ట్‌గా ఆమె కనిపించడం ఇదే తొలిసారి. కాగా ఈ షో జనవరి 16 నుంచి జీ తమిళంలో ప్రసారం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement