రాధ కుటుంబం నుంచి మరో తార | Actress Radha's Sister daughter to be introduced in Gauri Nair | Sakshi
Sakshi News home page

రాధ కుటుంబం నుంచి మరో తార

Published Sun, Aug 17 2014 11:56 PM | Last Updated on Sat, Sep 2 2017 12:01 PM

రాధ కుటుంబం నుంచి మరో తార

రాధ కుటుంబం నుంచి మరో తార

 చిత్ర రంగంలో వారసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా హీరోయిన్ల కుటుంబాల నుంచి వారసురాళ్లు పెరుగుతున్నారు. నటి రాధ విషయం తీసుకుంటే 1990 దశకంలో తమిళం, తెలుగు భాషల్లో హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ ఆమె. ఇప్పుడీ మాజీ బ్యూటీ తన ఇద్దరు కూతుళ్లు కార్తిక్, తులసిలను హీరోయిన్లుగా రంగంలోకి దింపారు. తాజాగా ఆ కుటుంబం నుంచి మరో హీరోయిన్ రంగ ప్రవేశం చేశారు.
 
 నటి రాధ సోదరి కూతురు గౌరి నాయర్ వలి యుడన్ ఒరు కాదల్ చిత్రంలో నాయికిగా నటిస్తున్నారు. నాయకుడిగా నవ నటుడు రాజేష్ నటిస్తున్న ఈ చిత్రాన్ని మాతాస్ బ్లెస్సింగ్ స్టూడియోస్ పతాకంపై రవి రాజేష్ నిర్మిస్తున్నారు. సంజీవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ, పల్లెటూరిలో జాలీగా తిరిగే హీరో పక్క ఊరులోని ధనవంతుల అమ్మాయి ప్రేమలో పడతాడన్నారు. అయితే అతని ప్రేమను గెలుచుకున్నాడా? లేదా? అన్నదే చిత్ర కథ అని చెప్పారు.
 
 హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉండే వలియుడన్ ఒరు కాదల్ చిత్ర చివరి ఘట్ట సన్నివేశాలు అనూహ్య రీతిలో ఉంటాయన్నారు. చిత్ర షూటింగ్‌ను నాగర్‌కోయిల్ పరిసర ప్రాంతాల్లో పూర్తి చేసినట్లు వెల్లడించారు. త్వరలో చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. జికె సెల్వ సంగీతానికి, ఎస్ సెల్వకుమార్ చాయాగ్రహణం అందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement