పటాన్‌చెరు టౌన్: ప్రముఖ దర్శకుడు మణిరత్నం తీసిన నాయగన్ సినిమా తాను సినీ రంగంలో అడుగుపెట్టడానికి ప్రేరణ అని, ఆ సినిమాలో ఉన్న వాటిని తన సినిమాల్లో చూపించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రసిద్ధ భారతీయ సినీ దర్శకుడు, నిర్మాత, నటుడు గౌతం వాసుదేవ్ మీనన్ అన్నారు. రుద్రారంలోని గీతం విశ్వవిద్యాలయంలో రివైండ్ ద మిలీనియమ్ ఇతివృత్తంతో సోమవారం నిర్వహించిన టెడ్‌ఎక్స్ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.
తాను అనుకున్నది, తన జీవితంలో ఎదురైన సంఘటలనే సినిమాగా తీస్తానన్నారు. కష్టపడకుండా ఏదీ సాధించలేమని, ఏదైనా ఒక కళలో నెపుణ్యం సాధించాలంటే పూర్తి దృష్టిని కేంద్రీకరించాలని ప్రముఖ భరతనాట్య నృత్యకారిణి సవితా శాస్త్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండీ మ్యూజిక్ ఆర్టిస్ట్ నితీశ్ కొండపర్తి, సిస్సీ ఐస్ పాప్స్ వ్యవస్థాపకుడు రని కాబ్రా, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment