దూసుకుపోతున్న ‘కనులు కనులను దోచాయంటే’ New theatres added for Kanulu Kanulanu Dochayante | Sakshi
Sakshi News home page

మరో 40 థియేటర్లలో ‘కనులు కనులను దోచాయంటే’

Published Sat, Mar 7 2020 9:07 PM

New theatres added for Kanulu Kanulanu Dochayante - Sakshi

పెద్ద చిత్రాల నుండి చిన్న చిత్రాల వరకూ... కొన్నేళ్లుగా నిర్మాతలు అనుసరించే సూత్రం ఒక్కటే! వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేసి, తొలి వారంలో వీలైనన్ని వసూళ్లు రాబట్టుకోవాలని చూస్తున్నారంతా!! రెండో వారానికి థియేటర్ల సంఖ్యను తగ్గిస్తున్నారు. థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు సంఖ్య కూడా తగ్గుతోంది. కానీ, ‘కనులు కనులను దోచాయంటే’ సినిమా మాత్రం ఈ పరిస్థితికి అతీతమని చెప్పాలి. రెండో వారంలో ఈ సినిమా థియేటర్లు పెరిగాయి. (‘కనులు కనులను దోచాయంటే’ మూవీ రివ్యూ)

దుల్కర్‌ సల్మాన్‌, రీతూ వర్మ జంటగా నటించిన రొమాంటిక్‌ థ్రిల్లర్‌ ‘కణ్ణుమ్‌ కణ్ణుమ్‌ కుళ్లయడిత్తా’. తెలుగులో ‘కనులు కనులను దోచాయంటే’గా విడుదలైంది. దేసింగ్‌ పెరియసామి దర్శకుడు. వయోకామ్‌ 18 స్టూడియోస్‌, ఆంటో జోసెఫ్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో 'కెఎఫ్‌సి ఎంటర్‌టైన్‌మెంట్స్‌' విడుదల చేసింది. ఫిబ్రవరి 28న విడుదలైన హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంతే కాదు, ప్రేక్షకుల డిమాండ్ మేరకు శనివారం నుండి 40 థియేటర్లను పెంచుతున్నట్టు నిర్మాతలు తెలిపారు. 

'కెఎఫ్‌సి ఎంటర్‌టైన్‌మెంట్స్‌' నుండి కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ ‘సినిమాకు చక్కటి ఆదరణ లభిస్తోంది. ప్రేక్షకులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల డిమాండ్ మేరకు ఈ రోజు నుండి మేం 40 స్క్రీన్స్ యాడ్ చేశాం. అశేష ప్రేక్షకాదరణతో రెండో వారంలోనూ సినిమా థియేటర్లలో బలంగా నిలబడడమే కాదు, మంచి వసూళ్లను రాబడుతోంది’ అని అన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement