ధనుష్‌ ఇడ్లీ కొట్టు! | Dhanush announces his 4th directorial and 52nd film titled Idli Kadai | Sakshi
Sakshi News home page

ధనుష్‌ ఇడ్లీ కొట్టు!

Published Fri, Sep 20 2024 4:21 AM | Last Updated on Fri, Sep 20 2024 4:21 AM

Dhanush announces his 4th directorial and 52nd film titled Idli Kadai

ధనుష్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించనున్న తాజా సినిమాకు ‘ఇడ్లీ కడై’ (ఇడ్లీ కొట్టు) అనే టైటిల్‌ ఖరారైంది. గురువారం ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ధనుష్‌ కెరీర్‌లోని ఈ 52వ చిత్రాన్ని డాన్‌ పిక్చర్స్, వండర్‌బార్‌ ఫిల్మ్స్‌ పతాకాలపై ఆకాశ్‌ భాస్కరన్‌ నిర్మించనున్నారు. ‘‘మా డాన్‌ పిక్చర్స్‌ సంస్థలోని తొలి సినిమాకే ధనుష్‌గారితో అసోసియేట్‌ కావడం సంతోషంగా ఉంది. మా సంస్థలో ఈ సినిమా ఓ మైల్‌స్టోన్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది. త్వరలోనే ఈ సినిమా గురించిన పూర్తి వివరాలను వెల్లడిస్తాం’’ అన్నారు ఆకాశ్‌ భాస్కరన్‌. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, కెమెరా: కిరణ్‌ కౌశిక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement