Super Star Rajinikanth Signed Two Films With LYCA PRODUCTIONS - Sakshi
Sakshi News home page

Super Star Rajinikanth: లైకా ప్రొడక్షన్స్‌తో సూపర్‌స్టార్.. ఒకేసారి రెండు భారీ ప్రాజెక్టులు.!

Published Fri, Oct 28 2022 8:08 PM | Last Updated on Fri, Oct 28 2022 8:43 PM

Super Star Rajinikanth Signed two films with LYCA PRODUCTIONS  - Sakshi

సూపర్‌స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆయన సినిమాల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్‌ న్యూస్ చెప్పారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో రెండు సినిమాలకు సూపర్‌స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్స్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలు వచ్చేనెల 5న చెన్నైలో జరగనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండబోతున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది నిర్మాణ సంస్థ. 

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న జైలర్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. జైలర్ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే తాజాగా రెండు కొత్త ప్రాజెక్ట్‌లకు సంతకం చేశారు. ఇవాళ లైకా ప్రొడక్షన్స్ అధినేత తమిళకుమారన్, ఛైర్మన్‌ సుభాస్కరన్‌, బ్యానర్‌ డిప్యూటీ ఛైర్మన్‌ ప్రేం శివసామితో రజనీకాంత్‌ ఉన్న ఫోటోనూ సోషల్‌ మీడియాలో షేర్ చేశారు.

రజినీకాంత్ నటిస్తున్న జైలర్ మూవీలో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని 2023లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతమందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement