
తమిళ హీరో కార్తి నటించిన చిత్రం 'విరుమన్'. తాజాగా ఈ సినిమాను ‘పసలపూడి వీరబాబు’గా తెలుగులో రిలీజ్ చేసింది చిత్రబృందం. అయితే ఈ చిత్రాన్ని డైరెక్ట్‌గా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేశారు. ఆగస్టు 12న తమిళంలో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ సినిమా. కార్తికి కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ ఉంది.
అభిమాన హీరో చిత్రాన్ని మిస్సవుతున్న టాలీవుడ్ ప్రేక్షకులకు ఇది గుడ్ న్యూస్. 'పసలపూడి వీరబాబు'గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే మాస్ యాక్షన్ డ్రామా కథతో ముత్తయ్య ఈ సినిమాను తెరకెక్కించారు. అగ్ర దర్శకుడు శంకర్ కుమార్తె అదితి శంకర్ కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, రాజ్‌కిరణ్, సూరి కీలక పాత్రల్లో కనిపించారు. ఇంకెందుకు ఆలస్యం సినిమా చూసేయండి.
Comments
Please login to add a commentAdd a comment