మహాభారతం ఆధారంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'శాకుంతలం'. ఈ చిత్రానికి దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వ వహిస్తున్నారు. ఈ మూవీలో సమంత టైటిల్ రోల్ పోషిస్తోంది. నటిస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన చిత్రబృందం ఓ క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. ఈ మూవీని 3డీలో విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రబృందం ట్వీట్ చేసింది.
(చదవండి: సమంత 'శాకుంతలం' నుంచి క్రేజీ అప్‌డేట్.. రిలీజ్ డేట్ అప్పుడే)
ఇటీవలే సుదీప్ నటించిన విక్రాంత్ రోణ సైతం 3డీలో కనువిందు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సమంత శాకుంతలం 3డీలో అలరించేందుకు సిద్ధమైంది. ‘శాకుంతలం ఇప్పుడు 3డీలో రానుంది. ఈ సినిమా కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం అని ట్విటర్‌లో వెల్లడించింది. ఈ విషయంపై గతంలోనే వార్తలు వచ్చినా ఇప్పుడు అధికారికంగా ప్రకటించింది.ఈ వార్త విని సమంత ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
సమంత ప్రధాన పాత్రలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శకుంతల పాత్రలో సమంత, దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పిస్తుండగా.. మణిశర్మ సంగీతమందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్‌లకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
#Shaakuntalam Also In 3D.
— Gunaa Teamworks (@GunaaTeamworks) November 4, 2022
A new release date will be announced soon! https://t.co/iFeTe4X60U@Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan #ManiSharma @neelima_guna @GunaaTeamworks @SVC_official @neeta_lulla @tipsofficial #EpicLoveStory #MythologyforMilennials#Shaakuntalam3D pic.twitter.com/gAPy7InS5D
Comments
Please login to add a commentAdd a comment