
కోలీవుడ్‌లో అవకాశాల కోసం చాలా మంది ఆరట పడుతుంటారు. ముఖ్యంగా కథానాయిక అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. ఇక్కడ రాణిస్తే ఇతర భాషల్లో అవకాశాలు ముంగిట వాలతాయి. బాలీవుడ్ బ్యూటీస్ కూడా కోలీవుడ్‌లో అవకాశాలొస్తే చేజార్చుకోవడానికి ఇష్టపడరు. అలాంటిది అనుష్క మాత్రం కోలీవుడ్ అంటేనే విముఖత చూపుతున్నారనే ప్రచారం సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. 2005లో ‘సూపర్’ సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన ఈ యోగా టీచర్ అదే జోరుతో రెండో చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయ్యారు. సుందర్.సీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుష్క అందాలను మితి మించి ఆరబోసి సినీ ప్రియులకు కనువిందు చేసింది. అయినా ఫలితం లేకపోయింది. కోలీవుడ్ అనుష్క అందాలను పట్టించుకోలేదు. దీంతో తెలుగులోనే దృష్టి సారించింది. అక్కడ పాపులర్ అయిన తరువాతనే మళ్లీ కోలీవుడ్ అవకాశాలు ఇచ్చింది. విజయ్‌తో నటించిన వేట్టైక్కారన్ చిత్రం అనుష్కకు ఇక్కడ తొలివిజయం అని చెప్పవచ్చు.
ఆ తరువాత కోలీవుడ్‌లో వరుసగా అందిపుచ్చుకున్నారు. ఈ బ్యూటీపై టాలీవుడ్‌లో పలు వదంతులు ప్రచారమైనా, అంతకు మించి కోలీవుడ్‌లోనూ హల్‌చల్ చేశాయి. ముఖ్యంగా నటుడు ఆర్యతో కలిపి రకరకాల వదంతులు దొర్లాయి. అలాంటివి అనుష్కను చాలానే ఇబ్బందులు పెట్టాయి. అదీ కాకుండా ఇక్కడి మీడియా తరచూ ఏదో ఒక అసత్యప్రచారం చేస్తూ అనుష్కను మనస్తాపానికి గురి చేసిందనే చింత అనుష్కలో ఏర్పడింది. దీంతో తమిళ మీడియాను దూరంగా పెట్టేశారనేది ప్రచారంలో ఉంది. అదీగాక ఈ మధ్య అనుష్క నటించిన తమిళ చిత్రం ఏదీ పెద్దగా సక్సెస్ కాలేదు. ఈ కారణంగానూ కోలీవుడ్‌లో కొన్ని అవకాశాలను అనుష్క వాంటెడ్‌గానే నిరాకరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో అనుష్క కోలీవుడ్‌పై విముఖత చూపిస్తుందనే ప్రచారానికి సోషల్ మీడియా తెరలేపింది.
Comments
Please login to add a commentAdd a comment