తమిళ స్టార్ హీరో నటిస్తున్న తాజా చిత్ర 'వారీసు'. తెలుగులో వారసుడిగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో నటి రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో శరత్‌కుమార్, ప్రకాశ్‌రాజ్, యోగిబాబు, షామ్, ఖుష్బు, సంగీత, ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజా అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీలో హీరో విజయ్ ఓ పాట పాడినట్లు తెలుస్తోంది.
బీస్ట్ మూవీ తర్వాత తమిళ స్టార్ ఈ సినిమాలో పాట పాడారు. ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నారు. విజయ్‌తో అతనికి ఇదే మొదటి చిత్రం. గతంలో రిలీజైన బీస్ట్‌లో కూడా విజయ్ శివకార్తికేయన్ రాసిన ఓ పాటను పాడారు. వారీసులో విజయ్ పాట అభిమాలను ఆకట్టుకునేలా ఉండనున్నట్లు తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2023 సంక్రాతికి థియేటర్లలో సందడి చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment