Vami paidipally
-
తమిళ స్టార్ విజయ్ మూవీ అప్డేట్.. బీస్ట్ తర్వాత మళ్లీ..!
తమిళ స్టార్ హీరో నటిస్తున్న తాజా చిత్ర 'వారీసు'. తెలుగులో వారసుడిగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో నటి రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో శరత్‌కుమార్, ప్రకాశ్‌రాజ్, యోగిబాబు, షామ్, ఖుష్బు, సంగీత, ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజా అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో హీరో విజయ్ ఓ పాట పాడినట్లు తెలుస్తోంది. బీస్ట్ మూవీ తర్వాత తమిళ స్టార్ ఈ సినిమాలో పాట పాడారు. ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నారు. విజయ్‌తో అతనికి ఇదే మొదటి చిత్రం. గతంలో రిలీజైన బీస్ట్‌లో కూడా విజయ్ శివకార్తికేయన్ రాసిన ఓ పాటను పాడారు. వారీసులో విజయ్ పాట అభిమాలను ఆకట్టుకునేలా ఉండనున్నట్లు తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2023 సంక్రాతికి థియేటర్లలో సందడి చేయనుంది. -
మహేష్ మూవీకి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2017 సమ్మర్లో రిలీజ్‌కు రెడీ అవుతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కన్నా ముందే మరో సినిమాను ప్రారంభించనున్నాడు మహేష్. హ్యాట్రిక్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా షూటింగ్‌కు రెడీ అవుతున్నాడు. అంతేకాదు కొరటాల సినిమా తరువాత చేయబోయే సినిమాకు కూడా ఓకె చెప్పేశాడు మహేష్. పీవీపీ సంస్థ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ హీరోగా ఓ సినిమాను ప్రారంభించనుంది. మహేష్ బాబు 25వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు మలయాళ సంగీత దర్శకుడు స్వరాలందించనున్నాడు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఊపిరి సినిమాకు మ్యూజిక్ చేసిన గోపిసుందర్ మహేష్ సినిమాకు కూడా మ్యూజిక్ చేస్తున్నాడు.