
పూజా హెగ్డే
తెలుగులో బిజీగా ఉన్న పూజా హెగ్డేకి కోలీవుడ్ నుంచి కబురు అందిందని సమాచారం. మాస్ హీరో విజయ్ 65వ సినిమాలో తనను కథానాయికగా అడిగారట. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించనుంది. బాక్సింగ్ నేపథ్యంలో హిందీలో తీసిన ‘సాలా ఖదూస్’ ద్వారా దర్శకురాలిగా పరిచయమైన సుధ కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని టాక్. ‘సాలా ఖదూస్’కి రీమేక్‌గా తెలుగులో వెంకటేశ్‌తో ఆమె ‘గురు’ సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మోహన్‌బాబు కీలక పాత్రలో సూర్య హీరోగా సుధ ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమా తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రం తర్వాత విజయ్‌తో చేయబోయే సినిమాని పట్టాలెక్కిస్తారట. వార్తల్లో ఉన్న ప్రకారం ఇందులో పూజా హెగ్డే కథానాయికగా కన్‌ఫార్మ్ అయితే ఎనిమిదేళ్ల తర్వాత ఆమె తమిళ సినిమాలో నటిస్తున్నట్లు అవుతుంది. 2012లో చేసిన ‘ముగముడి’ చిత్రంతోనే పూజా కథానాయికగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘ఒక లైలా కోసం’తో తెలుగులో, ‘మొహెంజోదారో’తో హిందీ తెరకు పరిచయమయ్యారు ఈ ఉత్తరాది భామ. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన ఓ సినిమా, అఖిల్ సరసన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రాల్లో నటిస్తున్నారు పూజా హెగ్డే.
Comments
Please login to add a commentAdd a comment