
తమిళ స్టార్ హీరోల్లో ఒకరైన విజయ్ నటిస్తున్న 69వ చిత్రం ‘దళపతి 69’ శుక్రవారం ఘనంగాప్రారంభమైంది. ఈ చిత్రానికి హెచ్ .వినోద్ దర్శకత్వం వహిస్తుండగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. కేవీఎన్‌ప్రోడక్షన్స్‌పై ఎన్‌కే, వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ మూవీ నటీనటులు, సాంకేతిక నిపుణుల సమక్షంలో పూజా కార్యక్రమాలతో ఆరంభమైంది. ‘‘విజయ్ కెరీర్‌లో హిస్టారిక్‌ప్రాజెక్ట్ ‘దళపతి 69’. తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ సిల్వర్ స్క్రీన్ మీద చివరిసారిగా కనిపించనున్న చిత్రం మాదే.
దళపతి ఫ్యాన్స్‌కి ఇదొక ఎమోషనల్‌ప్రాజెక్ట్. నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. విజయ్ వారసత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను అత్యంత భారీగా, తరాలు గుర్తుపెట్టుకునేలా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో 2025 అక్టోబర్‌లో ఈ చిత్రం విడుదల కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. బాబీ డీయోల్, గౌతమ్ వాసుదేవ మీనన్, ప్రియమణి, ప్రకాశ్‌రాజ్, మమిత బైజు ఇతరపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్, కెమెరా: సత్యన్ సూర్యన్.
Comments
Please login to add a commentAdd a comment