
మాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరిగా కొనసాగుతున్న మంజు వారియర్ ఇప్పుడు కోలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వనున్నారు. వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుశ్ హీరోగా ‘అసురన్’ అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ పాత్రకు మంజు వారియర్‌ను తీసుకున్నారు టీమ్. ఈ నెల 26న ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుంది.
‘‘మా సినిమాలో ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ కోసం ఎవర్‌గ్రీన్ మంజు వారియర్‌ను తీసుకున్నాం. ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నందుకు ఆనందంగా ఉంది. అద్భుతమైన ప్రతిభాశాలి అయిన ఆమె నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాను’’ అని ధనుశ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment