
పాత్రల్లోకి ఇట్టే మారిపోయే నటుల్లో తమిళ నటుడు ధనుష్ ఒకరు. లేటెస్ట్‌గా వయసు మళ్లిన వ్యక్తిగా మారిపోయారు. ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘అసురన్’. వెట్రీమారన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తండ్రీ కొడుకుల్లా డబుల్ యాక్షన్ చేస్తున్నారు ధనుష్. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో మలయాళ నటి మంజు వారియర్ హీరోయిన్‌గా కనిపిస్తున్నారు.
తమిళ నవల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇందులో ధనుష్ కొత్త స్టిల్‌ను రిలీజ్ చేశారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాది రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment