
సాక్షి, చెన్నై: ఒక్క సినిమా విజయం సాధిస్తే చాలు అమాంతం రెమ్యునరేషన్ పెంచేస్తారు హీరో, హీరోయిన్లు. అందుకు రకుల్‌ప్రీత్‌సింగ్ ఏమాత్రం అతీతం కాదు. కోలీవుడ్‌లో ఒక్క విజయం కోసం చాలా కాలం ఎదురుచూపులు చూసింది ఈ అమ్మడు. పుత్తగం, తడయార తాక్క, ఎన్నమో ఏదో వంటి చిత్రాల్లో నటించిన రకుల్‌కు వాటిలో ఏ ఒక్కటీ విజయాన్ని అందించలేకపోయాయి. దీంతో తమిళంలో సక్సెస్ ఎండమావిగా మారడంతో టాలీవుడ్‌పై దృష్టిసారించింది. వరుస విజయాలతో క్రేజీ హీరోయిన్‌గా చెలామణి అవుతోంది. అలాంటి రకుల్ కోలీవుడ్‌లో విజయదాహాన్ని చాలా కాలం నిరీక్షణ తరువాత ధీరన్ అధికారం ఒండ్రు రూపంలో వరించింది.
ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సక్సెస్‌లు ఇస్తున్నా, స్టార్ హీరోలకు సమానంగా హీరోయిన్లకు పారితోషికాన్ని ఇవ్వడం లేదని ఆరోపణలు గుప్పించింది. నయనతార లాంటి వారు వరుస విజయాలతో అగ్రకథానాయకిగా రాణిస్తున్నా, లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఆమె రూ.3 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోందని, అదే స్టార్ హీరోలయితే రూ.15 కోట్లకు పైగా అందుకుంటున్నారని అంది. లేడీ ఓరియంటెడ్ కథాపాత్రల్లో నటిస్తున్న నయనతార చిత్రాలు కమర్షియల్‌గానూ మంచి వసూళ్లు సాధిస్తున్నా, చాలా తక్కువ పారితోషికం ఇస్తున్నారని విమర్శించింది. తమిళ పరిశ్రమలో పురుషాధిక్యం కొనసాగుతోందని అంటూనే, తన పారితోషికం పెంచాలనే విషయాన్ని చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం రకుల్ చేతిలో ఒక్క కోలీవుడ్ చిత్రం కూడా లేదు. అయితే సూర్య సరసన సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఒక చిత్రం, విజయ్ తాజా చిత్రంలోనూ హీరోయిన్‌గా రకుల్‌ప్రీత్ సింగ్ పేరు వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment