కోలీవుడ్ స్టార్‌ హీరో భారీ యాక్షన్‌ చిత్రం.. ట్రైలర్‌ ఎప్పుడంటే? | Kollywood Star Suriya Latets Movie Kanguva Update Goes Viral | Sakshi
Sakshi News home page

Kanguva: సూర్య భారీ బడ్జెట్ చిత్రం.. ట్రైలర్ అప్‌డేట్‌ వచ్చేసింది!

Published Sat, Aug 10 2024 3:07 PM | Last Updated on Sat, Aug 10 2024 3:07 PM

Kollywood Star Suriya Latets Movie Kanguva Update Goes Viral

కోలీవుడ్ సూపర్ స్టార్‌ సూర్య నటిస్తోన్న భారీ యాక్షన్‌ చిత్రం కంగువా. ఈ సినిమాను శివ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ సూర్య విలక్షణమైన పాత్రలో కనిపించనున్నారు. స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం సూర్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. కంగువా ట్రైలర్‌ను ఈ నెల 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ట్విటిర్‌లో పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 10న థియేటర్లలో రిలీజ్ కానుందని ఇప్పటికే వెల్లడించారు.  కాగా.. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement